ఖతార్ లో 50వేలమంది విద్యార్థులకు టీడీఏపీ వ్యాక్సిన్..!!
- January 12, 2026
దోహా: ఖతార్ ప్రజారోగ్య మంత్రిత్వ శాఖ 2026లో తొమ్మిది మరియు పదవ తరగతి విద్యార్థులకు టెటానస్, డిఫ్తీరియా మరియు పెర్టుసిస్ (Tdap) వ్యాక్సిన్ వేయనుంది. విద్యా మరియు ఉన్నత విద్యా మంత్రిత్వ శాఖ, హమద్ మెడికల్ కార్పొరేషన్ మరియు ప్రైమరీ హెల్త్ కేర్ కార్పొరేషన్‌తో కలిసి వార్షిక క్యాంపెయిన్ ను ప్రారంభించింది.
278 ప్రభుత్వ, ప్రైవేట్ మరియు కమ్యూనిటీ పాఠశాలల్లోని 51,772 మంది విద్యార్థులకు టీకాలు వేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పటికే పేరెంట్స్ కు నోటిఫికేషన్లను పంపే ప్రక్రియను ప్రారంభించినట్లు ఆరోగ్య పరిరక్షణ మరియు అంటువ్యాధుల నియంత్రణ విభాగం డైరెక్టర్ డాక్టర్ హమద్ ఈద్ అల్-రొమైహి తెలిపారు. వ్యాక్సినేషన్ పై అపోహలను తొలగించేందుకు స్కూల్స్ వద్ద అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు.
ప్రజారోగ్య మంత్రిత్వ శాఖ గత శనివారం దాదాపు 240 మంది వైద్య మరియు నర్సింగ్ నిపుణులతో అవగాహన వర్క్‌షాప్‌ను నిర్వహించింది. ఈ వార్షిక వ్యాక్సినేషన్ ప్రక్రియను విజయవంతం చేయాలని కోరారు.
తాజా వార్తలు
- సంక్రాంతికి కొత్త ఆఫీసులోకి ప్రధాని..
- గల్ఫ్ కార్మికుల మానవత్వం
- యూఏఈలో ఘనంగా సంక్రాంతి వేడుకలు
- ఒక్కరోజు విరామం తీసుకుందామంటే ఏదో ఒక పని పడుతోంది: సీఎం రేవంత్
- టీసీఎస్ లాభం రూ.10657 కోట్లు..
- యుద్ధ కళల్లో పవన్ కల్యాణ్ కు అంతర్జాతీయ గుర్తింపు
- దుబాయ్ హిట్ అండ్ రన్ కేసు.. ఇంకా ఐసియులోనే గర్భిణి..!!
- వెనెజువెలా అధ్యక్షుడుగా తనకు తానే ప్రకటించుకున్న ట్రంప్
- భారత్ అమ్ములపొదిలో చేరిన అత్యాధునిక మిస్సైల్
- సౌదీలో రైడ్-హెయిలింగ్ యాప్ కు ఫుల్ డిమాండ్..!!







