భారత్ అమ్ములపొదిలో చేరిన అత్యాధునిక మిస్సైల్
- January 12, 2026
హైదరాబాద్‌లోని డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ లాబొరేటరీ అత్యాధునిక పోర్టబుల్ యాంటీ ట్యాంక్ గైడెడ్ మిస్సైల్ ను విజయవంతంగా పరీక్షించింది. మహారాష్ట్రలోని అహల్య నగర్‌లోని కేకే రేంజెస్‌లో టాప్ అటాక్ సామర్థ్యంతో ఈ పరీక్ష పూర్తయింది. అత్యాధునిక థర్డ్ జెన్ ఫైర్ అండ్ ఫర్గెట్, మ్యాన్ పోర్టబుల్ యాంటీ-ట్యాంక్ గైడెడ్ మిస్సైల్ ఇది. పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో రూపుదిద్దుకుంది. ఈ మిస్సైల్ లో ఇమేజింగ్ ఇన్‌ఫ్రారెడ్ హోమింగ్ సీకర్, ఆల్ ఎలక్ట్రిక్ కంట్రోల్ యాక్చుయేషన్ సిస్టమ్, ఫైర్ కంట్రోల్ సిస్టమ్, టాండమ్ వార్ హెడ్, ప్రొపల్షన్ సిస్టమ్, హై పర్ఫార్మెన్స్ సైటింగ్ సిస్టమ్ వంటి అత్యంత కీలకమైన భాగాలు ఉన్నాయి.
మిస్సైల్ అభివృద్ధిలో భాగస్వామ్యం
హైదరాబాద్ లోని డీఆర్డీఓ రీసెర్చ్ సెంటర్ ఇమారత్, చండీగఢ్ లోని టెర్మినల్ బాలిస్టిక్స్ రీసెర్చ్ లాబొరేటరీ, పుణేలోని హై ఎనర్జీ మెటీరియల్స్ రీసెర్చ్ లాబొరేటరీ, డెహ్రాడూన్ లోని ఇన్‌స్ట్రుమెంట్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఎస్టాబ్లిష్‌మెంట్ వంటి రక్షణ అనుబంధ ల్యాబొరేటరీలు ఈ మిస్సైల్ అభివృద్ధిలో భాగస్వామ్యం అయ్యాయి. ప్రయోగాల కోసం అందుబాటులోకి తీసుకొచ్చిన మూవింగ్ వార్ ట్యాంక్ మోడల్, థర్మల్ టార్గెట్ సిస్టమ్‌ను రాజస్థాన్ జోధ్‌పూర్ డిఫెన్స్ లాబొరేటరీ అభివృద్ధి చేసింది. ఇమేజింగ్ ఇన్‌ఫ్రారెడ్ హోమింగ్ సీకర్ పగలు, రాత్రి యుద్ధ కార్యకలాపాలకు అనుకూలంగా ఉంటుంది. ఈ ప్రయోగం విజయవంతం కావడం పట్ల రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ హర్షం వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- సంక్రాంతికి కొత్త ఆఫీసులోకి ప్రధాని..
- గల్ఫ్ కార్మికుల మానవత్వం
- యూఏఈలో ఘనంగా సంక్రాంతి వేడుకలు
- ఒక్కరోజు విరామం తీసుకుందామంటే ఏదో ఒక పని పడుతోంది: సీఎం రేవంత్
- టీసీఎస్ లాభం రూ.10657 కోట్లు..
- యుద్ధ కళల్లో పవన్ కల్యాణ్ కు అంతర్జాతీయ గుర్తింపు
- దుబాయ్ హిట్ అండ్ రన్ కేసు.. ఇంకా ఐసియులోనే గర్భిణి..!!
- వెనెజువెలా అధ్యక్షుడుగా తనకు తానే ప్రకటించుకున్న ట్రంప్
- భారత్ అమ్ములపొదిలో చేరిన అత్యాధునిక మిస్సైల్
- సౌదీలో రైడ్-హెయిలింగ్ యాప్ కు ఫుల్ డిమాండ్..!!







