కాలిఫోర్నియాలోని విమానాశ్రయంలో విమానం కూలి నలుగురి మృతి

- July 28, 2016 , by Maagulf
కాలిఫోర్నియాలోని విమానాశ్రయంలో విమానం కూలి నలుగురి మృతి

ఉత్తర కాలిఫోర్నియాలోని విమానాశ్రయంలో సెస్నా310 అనే ప్రైవేట్‌ విమానం ల్యాండ్‌ అవుతూండగా ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ఘటనలో విమానంలోని నలుగురు ప్రయాణికులు మృతిచెందారు. విమానం రన్‌వేపై ల్యాండవుతుండగా పక్కకు ఒరిగిపోవడంతో మంటలు వ్యాపించాయని అధికారులు వెల్లడించారు. సిబ్బంది వచ్చి మంటలు అదుపుచేసేలోపే విమానం పూర్తిగా కాలిపోయినట్లు పేర్కొన్నారు. విమానంలో మృతిచెందినవారి వివరాలు తెలియాల్సి ఉంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com