రోగిపై అందరూ చూస్తుండగానే పెట్రోల్‌ పోసి నిప్పు అంటించిన వ్యక్తి

- July 28, 2016 , by Maagulf
రోగిపై అందరూ చూస్తుండగానే పెట్రోల్‌ పోసి నిప్పు అంటించిన వ్యక్తి

ఓ వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రోగిపై అందరూ చూస్తుండగానే పెట్రోల్‌ పోసి నిప్పంటించి ఆ రోగితో పాటు మరో ముగ్గురి చావుకు కారణమయ్యాడు. అల్బేనియాలోని ఓ ఆస్పత్రిలో చోటుచేసుకుంది ఈ ఘోరం. అల్బేనియా రాజధాని టిరానాలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలోని వార్డులోకి ఓ వ్యక్తి వచ్చి అక్కడే డయాలసిస్‌ చేయించుకుంటున్న పేషెంట్‌తో గొడవపడి చేయిచేసుకున్నాడు. అందరూ చూస్తుండగానే అతనిపై పెట్రోల్‌ పోసి నిప్పంటించాడు. వార్డులో ఒక్కసారిగా మంటలు భగ్గున వ్యాపించడంతో చుట్టుపక్కల వారు కూడా మంటల్లో చిక్కుకున్నారు. ఇది గమనించిన నర్సులు అప్రమత్తమై పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది వచ్చే లోపు మంటలు అదుపుచేసి మిగతావారిని కాపాడగలిగారు. కానీ ఆ రోగితో పాటు మరో ముగ్గురు రోగులు కూడా అప్పటికే అగ్నికి ఆహుతయ్యారు. ఈ ఘోరానికి పాల్పడిన వ్యక్తి పారిపోయాడు.
ఇదంతా అక్కడే ఉన్న సీసీటీవీలో రికార్డ్‌ అవడంతో పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు. దాడి చేయడానికి వచ్చిన వ్యక్తి కూడా డయాలసిస్‌ చేయించుకోవడానికే వచ్చాడని ముందుగా ఎవరు చికిత్స చేయించుకోవాలి అన్నదానిపై ఇద్దరికీ గొడవైందని ఆ కోపంతోనే అతడీ దారుణానికి పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com