'నాగబంధం' నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్
- January 16, 2026
అభిషేక్ నామా ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న మైథలాజికల్ యాక్షన్ డ్రామా 'నాగబంధం', విరాట్ కర్ణ హీరోగా నటిస్తున్న ఈ చిత్రం, ప్రొడక్షన్ చివరి దశకు చేరుకుంది. ఈ చిత్రం ఇప్పటికే తన గ్రాండ్ స్కేల్, ఆధ్యాత్మిక కథాంశంతో సంచలనం సృష్టిస్తుండగా, ఇప్పుడు చిత్ర బృందం హీరోయిన్ నభా నటేష్ ను పార్వతి పాత్రలో పరిచయం చేస్తూ ఆకట్టుకునే ఫస్ట్ లుక్‌ను విడుదల చేసింది.
మకర సంక్రాంతి పర్వదినం సందర్భంగా విడుదల చేసిన ఈ పోస్టర్‌లో, నభా నటేష్ అద్భుతమైన, సాంప్రదాయ లుక్ లో కనిపిస్తుంది. హుందాతనం, పవిత్రత, ఆధ్యాత్మికత వెదజల్లుతోంది. ఆమె ముఖంలో కనిపించే ఆత్మీయమైన భావం, భక్తి, పురాణాల మూలాల నుంచి పుట్టిన పాత్రను సూచిస్తుంది.
పోస్టర్‌కు మరింత వైభవాన్ని జోడిస్తూ ఆమె చేయి సమీపంలో నీలి రంగు పక్షి దర్శనమిస్తుంది. పక్కనే రాజసంగా నిలిచిన నెమలి, వెనుక కనిపించే ఆలయ నేపథ్యం ఈ అన్నీ పాత్రను అద్భుతంగా ఆవిష్కరిస్తున్నాయి.
ఐశ్వర్య మీనన్ మరో కథానాయికగా నటిస్తుండగా, జగపతి బాబు, జయప్రకాష్, మురళి శర్మ, బి.ఎస్. అవినాష్ వంటి ప్రముఖ నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.
నాగబంధం భారతదేశంలోని పురాతన విష్ణు దేవాలయాల నేపథ్యంలో సాగుతుంది. ఈ కథాంశం నాగబంధం సంప్రదాయంలోని పవిత్ర రహస్యాలను అన్వేషిస్తుంది, పురాణాలు, సస్పెన్స్, డివోషన్ బ్యాక్ డ్రాప్ లో ఒక ఉత్కంఠభరితమైన కథనంగా రూపొందుతోంది.
ఈ చిత్రానికి సౌందర్ రాజన్ ఎస్ సినిమాటోగ్రఫీ, ఆర్‌సి ప్రణవ్ ఎడిటింగ్, అశోక్ కుమార్ ప్రొడక్షన్ డిజైనర్. కిషోర్ అన్నపురెడ్డి, నిషిత నాగిరెడ్డి నిర్మిస్తున్న నాగబంధం ఈ వేసవిలో తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషలలో భారీగా విడుదల కానుంది.
నటీనటులు: విరాట్ కర్ణ, నభా నటేష్, ఐశ్వర్య మీనన్, జగపతి బాబు, జయప్రకాష్, మురళి శర్మ, బి.ఎస్ అవినాష్,
సాంకేతిక సిబ్బంది:
కథ, స్క్రీన్‌ప్లే & దర్శకత్వం: అభిషేక్ నామా
నిర్మాతలు: కిషోర్ అన్నపురెడ్డి, నిషిత నాగిరెడ్డి
డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ: సౌందర్ రాజన్ ఎస్
సంగీతం: అభే, జునైద్ కుమార్
ప్రొడక్షన్ డిజైనర్: అశోక్ కుమార్
ఎడిటర్: RC పనవ్
CEO: వాసు పోతిని
PRO: వంశీ-శేఖర్
తాజా వార్తలు
- సౌదీలో బయటపడ్డ భారీ బంగారు నిధి!
- స్టేడియం 974లో ఓపెన్ ఫైర్ ఫుడ్ ఫెస్టివల్ కు కొత్త ఉత్సాహం..!!
- మహిళా సహోద్యోగిపై వేడినీరు పోసిన వ్యక్తికి జైలుశిక్ష..!!
- జిలీబ్లోని అక్రమ ఫుడ్ ప్రొడక్షన్ యూనిట్ ధ్వంసం..!!
- బౌషర్లో డగ్స్ కలకలం..ఆసియా దేశస్థులు అరెస్ట్..!!
- యెమెన్ భద్రతకు మద్దతు ఇవ్వడంలో సౌదీ కీలక పాత్ర..!!
- జనవరి 17న సంఘీభావ దినోత్సవం..షేక్ హమ్దాన్ పిలుపు..!!
- తక్కువ కార్ ఇన్సూరెన్స్ ఆఫర్ల పై RAK పోలీసుల హెచ్చరిక
- ఇజ్రాయెల్లో భారీ భూకంపం..
- UAE నిపుణుల హెచ్చరిక: ‘నిశ్శబ్ద వేధింపులు’ ఎక్కువ ప్రమాదకరం







