త్వరలో 11 మున్సిపాలిటీల్లో ప్రారంభం కానున్న అన్న క్యాంటీన్లు
- July 28, 2016
రాష్ట్రంలోని 11 మున్సిపాలిటీల్లో త్వరలో అన్న క్యాంటీన్లను ఏర్పాటుచేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెలిపారు. గురువారం ఆయన అధికారులతో జరిపిన సమీక్షలో మాట్లాడుతూ... అమరావతిలో ఏర్పాటు చేసిన అన్న క్యాంటిన్ విజయవంతమైందన్నారు. దీన్ని మోడల్‌గా తీసుకుని రాష్ట్రంలో 11 మున్సిపాలిటీల్లో క్యాంటీన్లను ఏర్పాటు చేస్తామన్నారు. అలాగే ప్రజా సేవలు అన్నీ ఆన్లైన్లో పొందుపరిచి విస్తృతంగా సమర్ధవంతంగా, పారదర్శకంగా, వేగంగా అందించాలని ఆయన అధికారులను ఆదేశించారు. అలాగే గృహ నిర్మాణ పథకాలకు శ్రీకారం చుట్టాలని, రాష్ట్రంలోని అన్ని రైతు బజార్లను అభివృద్ధి చేస్తామన్నారు. 11 మునిసిపాలిటీల అధికారులకు కృష్ణా పుష్కరాల విధుల నుంచి మినహాయింపు ఇచ్చినట్లు తెలిపారు.
తాజా వార్తలు
- కువైట్‌లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్‌లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్‌లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







