న్యూ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు నిర్మాణంపై జజాన్ ఎమిర్ సమీక్ష..!!

- January 18, 2026 , by Maagulf
న్యూ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు నిర్మాణంపై జజాన్ ఎమిర్ సమీక్ష..!!

జజాన్:  కొత్త జజాన్ అంతర్జాతీయ విమానాశ్రయ ప్రాజెక్టును జజాన్ ప్రాంతం ఎమిర్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ అబ్దులాజీజ్ బిన్ మొహమ్మద్ బిన్ అబ్దులాజీజ్ పరిశీలించారు. పనుల పురోగతిని సమీక్షించారు. ఈ సందర్భంగా ప్రాజెక్టు పురోగతి గురించిన వివరాలను ఎమిర్ కు అధికారులు వివరించారు. నిర్మాణ పనులు 92 శాతం వరకు పూర్తయినట్లు పేర్కొన్నారు.  

విమానాశ్రయం ఏటా 5.4 మిలియన్ల మంది ప్రయాణీకులకు సేవలు అందించేలా నిర్మిస్తున్నారు. అత్యున్నత అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఆధునిక సౌకర్యాలు, సేవలను ఇది కలిగి ఉంటుందని పేర్కొన్నారు.

ఈ విమానాశ్రయం దాదాపు 48 మిలియన్ చదరపు మీటర్ల విస్తీర్ణంలో నిర్మించారు. 57,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఒక ప్రధాన ప్రయాణీకుల టెర్మినల్‌, 12 బోర్డింగ్ గేట్లు, 10 ఎయిర్ క్రాఫ్ట్ బ్రిడ్జిలు, 32 చెక్-ఇన్ కౌంటర్లు, ఎనిమిది సెల్ఫ్ సర్వీస్ కియోస్క్‌ లు, 2,000 పార్కింగ్ స్థలాలు, నాలుగు వెయిటింగ్ లాంజ్‌లు మరియు గంటకు 2,400 బ్యాగులను ప్రాసెస్ చేయగల స్మార్ట్ హ్యాండ్లింగ్ సిస్టమ్‌తో కూడిన నాలుగు బ్యాగేజ్ బెల్ట్‌లు ఉంటాయని అధికారులు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com