బహ్రెయిన్ ప్రభుత్వ పాఠశాలల్లో స్పెషల్ స్పోర్ట్స్ ట్రైనర్లు..!!
- January 18, 2026
మనామా: బహ్రెయిన్ లోని ప్రతి ప్రభుత్వ పాఠశాలలో స్పెషల్ స్పోర్ట్స్ ట్రైనర్లను నియమించే ప్రతిపాదనపై పార్లమెంటులో చర్చకు రానుంది. ఎంపీలు డాక్టర్ మహదీ అల్ షువైఖ్, అబ్దుల్నబీ సల్మాన్, మమ్‌దౌహ్ అల్ సలేహ్, హసన్ ఇబ్రహీం మరియు డాక్టర్ హిషామ్ అల్ అషిరి సమర్పించిన ఈ ప్రణాళిక, క్రీడా ప్రతిభ ఉన్న విద్యార్థులను గుర్తించి వారి సామర్థ్యాలను మెరుగు పరచడమే లక్ష్యంగా పెట్టుకుంది.
స్పెషలిస్ట్ కోచ్‌లు అథ్లెటిక్‌గా ప్రతిభావంతులైన విద్యార్థుల నైపుణ్యాలను మెరుగుపరుస్తారని డాక్టర్ అల్ షువైఖ్ తెలిపారు. అయితే, విద్యార్థుల ప్రతిభను పెంపొందించడానికి ఇప్పటికే కృషి చేస్తున్నామని విద్యా మంత్రిత్వ శాఖ ప్రకటించింది. PE ఉపాధ్యాయులు మరియు పాఠశాలల్లో క్రీడా పోటీలు వ్యక్తిగత క్రీడలను కవర్ చేస్తాయని, ప్రతిభ ఉన్న అథ్లెట్లను గుర్తించి ప్రోత్సాహిస్తున్నామని తెలిపింది.
ఈ సందర్భంగా బహ్రెయిన్‌లో జరిగిన 2024 అంతర్జాతీయ పాఠశాల క్రీడలను మంత్రిత్వ శాఖ హైలైట్ చేసింది. ఇక్కడ విద్యార్థులు 66 పతకాలు గెలుచుకున్నారని, అరబ్ దేశాలలో నాల్గవ స్థానంలో మరియు ప్రపంచవ్యాప్తంగా 13వ స్థానంలో నిలిచారని, జిమ్నాసియేడ్ అంతర్జాతీయ పాఠశాల ఛాంపియన్‌షిప్‌లో విజయం సాధించారని గుర్తుచేసింది.
పాఠశాల క్రీడల సందర్భంగా ప్రతిభావంతులైన విద్యార్థుల భాగస్వామ్యాన్ని ప్రోత్సహిస్తాయని మరియు మద్దతు ఇస్తామని, ఈ విషయంలో పార్లమెంటుకు మరింత స్పష్టత ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్లు విద్యామంత్రిత్వశాఖ తెలిపింది.
తాజా వార్తలు
- నటి శారదకు జేసీ డేనియల్ అవార్డు
- హైదరాబాద్ ECILలో అప్రెంటిస్ కొలువులు
- ‘డే ఆఫ్ సాలిడారిటీ’ సందర్భంగా UAE అంతటా ఎయిర్ షో
- సంక్రాంతి పేరుతో గ్రాండ్ గిఫ్ట్ అంటూ మెసేజులు
- తెలంగాణ మోడల్ స్కూల్ ప్రవేశాలు..
- గ్రీన్ కో సంస్థకు అభినందనలు తెలిపిన జయప్రకాశ్ నారాయణ
- చైనాలో కలకలం సృష్టిస్తున్న ‘నోరా వైరస్’
- అమెరికా–ఇరాన్ మధ్య మాటల యుద్ధం మరింత ఉధృతం
- DXB టెర్మినల్ 1 కి వెళ్లే బ్రిడ్జి విస్తరణ..!!
- కువైట్ లో జీరో టెంపరేచర్స్ పై హెచ్చరిక..!!







