DXB టెర్మినల్ 1 కి వెళ్లే బ్రిడ్జి విస్తరణ..!!
- January 18, 2026
యూఏఈ: దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం (DXB) టెర్మినల్ 1 కి వెళ్ళే బ్రిడ్జిని విస్తరించనున్నట్లు రోడ్లు మరియు రవాణా అథారిటీ (RTA) ప్రకటించింది. బ్రిడ్జి విస్తరణతో ఎయిర్ పోర్టుకు వెళ్లే ట్రాఫిక్ సామర్థ్యం మెరుగుపడుతుందని తెలిపింది.
ఈ విస్తరణ ప్రాజెక్ట్‌లో ట్రాఫిక్ లేన్‌ల సంఖ్యను మూడు నుండి నాలుగుకు పెరగనుంది. బ్రిడ్జి సామర్థ్యం గంటకు 4,200 వాహనాల నుండి గంటకు 5,600 వాహనాలకు పెరుగుతుంది. మొత్తంగా బ్రిడ్జి సామర్థ్యం 33 శాతం మెరుగు పడుతుందని ఆర్టీఏ వెల్లడించింది.
దుబాయ్ ఏవియేషన్ ఇంజనీరింగ్ ప్రాజెక్ట్స్ (DAEP) భాగస్వామ్యంతో చేసిన ఈ ప్రాజెక్ట్‌లో రోడ్డుకు ఇరువైపుల మౌలిక సదుపాయాలను అప్‌గ్రేడ్ చేయనున్నారు. ల్యాండ్‌స్కేపింగ్ పనులను కూడా చేపట్టనున్నారు.
తాజా వార్తలు
- నటి శారదకు జేసీ డేనియల్ అవార్డు
- హైదరాబాద్ ECILలో అప్రెంటిస్ కొలువులు
- ‘డే ఆఫ్ సాలిడారిటీ’ సందర్భంగా UAE అంతటా ఎయిర్ షో
- సంక్రాంతి పేరుతో గ్రాండ్ గిఫ్ట్ అంటూ మెసేజులు
- తెలంగాణ మోడల్ స్కూల్ ప్రవేశాలు..
- గ్రీన్ కో సంస్థకు అభినందనలు తెలిపిన జయప్రకాశ్ నారాయణ
- చైనాలో కలకలం సృష్టిస్తున్న ‘నోరా వైరస్’
- అమెరికా–ఇరాన్ మధ్య మాటల యుద్ధం మరింత ఉధృతం
- DXB టెర్మినల్ 1 కి వెళ్లే బ్రిడ్జి విస్తరణ..!!
- కువైట్ లో జీరో టెంపరేచర్స్ పై హెచ్చరిక..!!







