అమెరికా–ఇరాన్ మధ్య మాటల యుద్ధం మరింత ఉధృతం

- January 18, 2026 , by Maagulf
అమెరికా–ఇరాన్ మధ్య మాటల యుద్ధం మరింత ఉధృతం

అమెరికా, ఇరాన్ దేశాల మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ పై ఘాటుగా స్పందిస్తూ తీవ్ర ఆరోపణలు చేశారు.

ఇరాన్‌లో కొనసాగుతున్న నిరసనలకు ట్రంప్ బహిరంగంగా మద్దతు ఇవ్వడం పై ఖమేనీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. దేశంలో చోటుచేసుకున్న ఆందోళనలు, ప్రాణనష్టాలకు అమెరికా ప్రత్యక్షంగా బాధ్యత వహించాల్సి ఉంటుందని అన్నారు. ఈ నిరసనల వెనుక అమెరికా కుట్ర దాగి ఉందని, ఇరాన్‌ను రాజకీయంగా, ఆర్థికంగా అణిచివేయడమే వారి లక్ష్యమని ఖమేనీ ఆరోపించారు. ట్రంప్ చర్యలను అంతర్జాతీయ చట్టాలకు విరుద్ధమని వ్యాఖ్యానించారు.

ఖమేనీ వ్యాఖ్యలకు ప్రతిస్పందించిన డొనాల్డ్ ట్రంప్, ఇరాన్‌లో రాజకీయ మార్పు అవసరమని వ్యాఖ్యానించారు. 37 ఏళ్లుగా కొనసాగుతున్న ఖమేనీ పాలనకు ముగింపు పలకాల్సిన సమయం వచ్చిందని చెప్పారు. ఇరాన్ ప్రజలు కొత్త నాయకత్వాన్ని కోరుకుంటున్నారని, ప్రజాస్వామ్య మార్పులు అనివార్యమని ట్రంప్ పేర్కొన్నారు.

అమెరికా–ఇరాన్ మధ్య మాటల యుద్ధం మరింత ముదిరితే మధ్యప్రాచ్య ప్రాంతంలో అస్థిరత పెరిగే ప్రమాదం ఉందని అంతర్జాతీయ విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇరు దేశాల మధ్య ఇప్పటికే ఉన్న ఆర్థిక ఆంక్షలు, రాజకీయ విభేదాలకు ఈ వ్యాఖ్యలు మరింత బలం చేకూరుస్తున్నాయని వారు అభిప్రాయపడుతున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com