ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడితో సీఎం చంద్రబాబు భేటీ

- January 19, 2026 , by Maagulf
ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడితో సీఎం చంద్రబాబు భేటీ

జ్యూరిక్: వరల్డ్ ఎకనామిక్ ఫోరం (WEF) వార్షిక సమావేశాల్లో పాల్గొనే ఉద్దేశంతో స్విట్జర్లాండ్‌లోని జ్యూరిక్ నగరానికి చేరుకున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, సోమవారం అక్కడి విమానాశ్రయంలో భారత రాయబారి మృదుల్ కుమార్ చేత అధికారికంగా స్వాగతం పొందారు.

జ్యూరిక్ చేరుకున్న అనంతరం సీఎం చంద్రబాబు ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడు అజయ్ బంగా తో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో రాష్ట్ర ఆర్థిక వృద్ధి, మౌలిక వసతుల అభివృద్ధి, వివిధ అభివృద్ధి ప్రాజెక్టులకు అంతర్జాతీయ ఆర్థిక సహకారం అందించాల్సిన అవసరంపై చర్చలు జరిపినట్లు సమాచారం.

ఈ భేటీలో ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులకు అనుకూల వాతావరణం, పరిశ్రమల స్థాపనకు అవసరమైన పాలసీ సంస్కరణలు, గ్రీన్ ఎనర్జీ, లాజిస్టిక్స్, డిజిటల్ మౌలిక వసతుల రంగాల్లో రాష్ట్రం తీసుకుంటున్న చర్యలను సీఎం చంద్రబాబు వివరించినట్లు తెలిసింది.

దావోస్‌లో జరగనున్న WEF సదస్సు సందర్భంగా సీఎం చంద్రబాబు ప్రపంచవ్యాప్తంగా ఉన్న కార్పొరేట్ నేతలు, ఆర్థిక నిపుణులు, ప్రభుత్వాధినేతలతో సమావేశమై రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించడంపై దృష్టి సారించనున్నారు. ఈ పర్యటన ద్వారా ఏపీ ఆర్థికాభివృద్ధికి కొత్త మార్గాలు తెరవాలని ప్రభుత్వం భావిస్తోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com