వ్యభిచారం, డ్రగ్స్ రాకెట్ కేసులో భారత దంపతుల అరెస్ట్
- January 19, 2026
అమెరికా: అమెరికాలో భారీ సెక్స్, డ్రగ్స్ రాకెట్ నిర్వహిస్తున్నారన్న ఆరోపణల పై భారత సంతతికి చెందిన దంపతులతో పాటు మరో ముగ్గురిని ఫెడరల్, స్థానిక పోలీసులు అరెస్ట్ చేశారు. వర్జీనియా రాష్ట్రంలో వీరు తమ సొంత మోటల్‌నే అసాంఘిక కార్యకలాపాలకు కేంద్రంగా మార్చి ఈ దందా నడిపినట్లు అధికారులు వెల్లడించారు. వివరాల్లోకి వెళితే… 52 ఏళ్ల కోశా శర్మ, 55 ఏళ్ల తరుణ్ శర్మ దంపతులు వర్జీనియాలో ‘రెడ్ కార్పెట్ ఇన్’ అనే మోటల్ నిర్వహిస్తున్నారు. వీరు తమ మోటల్‌లోని మూడో అంతస్తును పూర్తిగా డ్రగ్స్ అమ్మకాలు, వ్యభిచారం కోసం కేటాయించి, కింది అంతస్తులలో సాధారణ అతిథులకు గదులు ఇచ్చేవారు. ఈ అక్రమ కార్యకలాపాల ద్వారా వచ్చే లాభాల్లో వాటాలు తీసుకునేవారని ఫెడరల్ అధికారులు తెలిపారు. వీరితో పాటు ఈ రాకెట్‌లో భాగస్వాములైన మార్గో పియర్స్ (51), జాషువా రెడ్డిక్ (40), రషార్డ్ స్మిత్ (33) అనే మరో ముగ్గురిని కూడా అరెస్ట్ చేశారు.
కోర్టు పత్రాల ప్రకారం 2025 మే నుంచి ఆగస్టు మధ్య ఎఫ్‌బీఐ, స్థానిక పోలీసులు తొమ్మిదిసార్లు అండర్‌కవర్ ఆపరేషన్లు నిర్వహించారు. ఏజెంట్లు విటులుగా, సెక్స్ వర్కర్లుగా మోటల్‌కు వెళ్లి వీరి గుట్టురట్టు చేశారు. ఈ క్రమంలో 15 సార్లు డ్రగ్స్ కొనుగోలు చేయగా, వాటిలో 11 సార్లు ఫెంటానిల్, నాలుగు సార్లు కొకైన్ లభించింది. కనీసం ఎనిమిది మంది మహిళలతో బలవంతంగా వ్యభిచారం చేయిస్తున్నారని, వారిని శారీరకంగా హింసిస్తూ బయటకు వెళ్లకుండా నిర్బంధించారని తేలింది.
తాజా వార్తలు
- షార్జాలో ఎతిహాద్ రైల్ స్టేషన్కు మూడు కొత్త బస్సు మార్గాలు
- నన్ను అరెస్ట్ చేయొచ్చు..అయినా వెనక్కి తగ్గం: అభిజీత్ దీప్కే
- ఐదు వారాల్లో తొలిసారి వారాంతపు పతన దిశగా డాలర్
- ఏపీ ప్రజలకు వాతావరణ శాఖ అలర్ట్
- డిసెంబర్ 11-12 తేదీల్లో కెనడాలో ప్రధాని మోదీ పర్యటన
- ఉద్యోగుల పాస్పోర్టులు ఇవ్వకపోతే QR25,000 జరిమానా..!
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్కు నేరుగా వెళ్లొచ్చు..!
- కువైట్లో తగ్గనున్న ఉష్ణోగ్రతలు..తేలికపాటి వర్షాలకు అవకాశం..!
- వృద్ధాప్యం, మెదడు వ్యాధులపై పరిశోధనకు సౌదీ అంతరిక్ష ప్రయోగం..!!
- 12 ఏళ్లకే నిత్య తమ్మనకు అంతర్జాతీయ పురస్కారం!







