నిర్మాత సుధాకర్ చెరుకూరితో మాగల్ఫ్ ముఖాముఖీ

- January 19, 2026 , by Maagulf
నిర్మాత సుధాకర్ చెరుకూరితో మాగల్ఫ్ ముఖాముఖీ

మాస్ మహారాజా రవితేజ సంక్రాంతి బ్లాక్ బస్టర్ 'భర్త మహాశయులకు విజ్ఞప్తి'. కిషోర్ తిరుమల దర్శకత్వంలో, సుధాకర్ చెరుకూరి ఎస్ఎల్‌వి సినిమాస్ బ్యానర్‌పై నిర్మించిన ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ లో డింపుల్ హయతి, ఆషిక రంగనాథ్ కథానాయికలుగా నటించారు. జనవరి 13న గ్రాండ్‌గా విడుదలైన ఈ సినిమా సంక్రాంతి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుని హౌస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ  సందర్భంగా నిర్మాత సుధాకర్ చెరుకూరి విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు.

భర్త మహాశయులకు విజ్ఞప్తి బ్రేక్ ఈవెన్ అయింది కదా.. హ్యాపీగా ఉన్నారా?
-చాలా హ్యాపీ. ఆంధ్ర మొత్తం ఆల్మోస్ట్ అయింది. ఇది లాంగ్ వీకెండ్. సోమవారం కూడా హాలిడే. నైజం తో పాటు మిగతా ఏరియాలో కూడా అయిపోతాయి.

-ఆడియన్స్ నుంచి చాలా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. అలాగే డిస్ట్రిబ్యూటర్స్ బయ్యర్స్ కూడా చాలా హ్యాపీగా వుండటం మాకు ఎంతో ఆనందం ఇచ్చింది.

పండక్కి రావాలనే ముందే ప్లాన్ చేసుకున్నారా?
-మేము పండగకి రావాలనే ఈ సినిమాని మొదలుపెట్టాం. 65 రోజుల్లో పూర్తి చేశాం.

రెగ్యులర్ రవితేజ గారి సినిమాల కాకుండా పండగకి ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ లాగా ఈ సినిమాని తీసుకురావాలని ఉద్దేశంతోనే ప్రారంభించాం. సినిమాని  అడుయన్స్ అద్భుతంగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇలాంటి సినిమాలు మరిన్ని చేయాలనే భావిస్తున్నాం.  

-మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ కి సంక్రాంతి సీజన్ లో డిమాండ్ ఉంటుందని ఈ సంక్రాంతితో మరోసారి రుజువైంది.

ఈ సినిమా కోసం కిషోర్ గారు ప్రమోషన్స్ లో కూడా చాలా ఇన్వాల్వ్ అయ్యారు. మా డైరెక్టర్, హీరో హీరోయిన్స్ ప్రమోషన్స్ కి చాలా సపోర్ట్ చేశారు. రేపటి నుంచి ప్రమోషన్స్ టూర్స్ కూడా ఉంటాయి  

పండగకి వచ్చిన అన్ని సినిమాలు కూడా విజయాలు సాధించాయి కదా.. ఎలా అనిపిస్తుంది?
-అరుదైన గొప్ప విషయం ఇది. వచ్చిన ఐదు సినిమాలు కూడా అద్భుతంగా ఆడాయి. సంక్రాంతికి చిరంజీవి గారి సినిమా ఫస్ట్ ఆప్షన్.  అందరూ ఆ సినిమాని చూసేశారు. ఇప్పుడు సెకండ్ వీక్ నుంచి మిగతా సినిమాలన్నీ కూడా రన్ అద్భుతంగా ఉండబోతుంది. రెండో మూడో వారాలు కూడా చాలా మంచి రన్ వుంటుంది.  

మీరు నానితో ప్యారడైజ్, దుల్కర్ సినిమా, ఈ సినిమా.. ఒకేసారి చేయడం ఎలా అనిపించింది?
-రవితేజ గారి సినిమా అన్నిటికంటే ముందు వస్తుందని మాకు తెలుసు. అందుకే ఇదే సినిమా మీద కాస్త ఎక్కువ ఫోకస్ చేయడం జరిగింది. పారడైజ్ కి మంచి టీం వుంది. మా సొంత మనుషులు ఉన్నారు. అన్ని  సినిమాలు కూడా అద్భుతంగా జరుగుతున్నాయి.

కథల విషయంలో మీ సెలక్షన్ ఎలా ఉంటుంది?
-నేను అన్ని కథలో వింటాను.  కొంతమందికి వినిపిస్తాను. కథ అనుకున్న తర్వాతే బడ్జెట్లన్ని అనుకుంటాం.

రవితేజతో సినిమా చేయడం ఎలా అనిపించింది?
-ఆయనతో పని చేయడం ఇది రెండోసారి. మేము మొదటిది అనుకున్నంతగా రాలేదు. ఇది మాత్రం మేము ఏదైతే అనుకున్నామో అన్ని ఎలిమెంట్స్ కూడా అద్భుతంగా వర్కౌట్ అయ్యాయి. ఆడియన్స్ చాలా ఎంజాయ్ చేస్తున్నారు. రవితేజ గారు  మాకొక బ్రదర్ లాగా ఉంటారు.

-ఈ సినిమా కోసం స్పెయిన్ లో ఒక 20 రోజులు షూటింగ్ చేశాం. ఆ విజువల్స్ అన్ని కూడా ఆడియన్స్ థియేటర్లో ఎంజాయ్ చేస్తున్నారు. విదేశాల్లో షూటింగ్ చేయడం కంఫర్టబుల్ గానే ఉంటుంది. కథపరంగా మేము స్పెయిన్ వెళ్లాల్సి వచ్చింది.

పారడైజ్ సినిమా మార్చిలోనే తీసుకొస్తున్నారా?  
-తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాం.

రామ్ చరణ్ సినిమా కూడా మార్చిలోనే ఉంది కదా?
-ఇద్దరమైతే ఒకేసారి రాము. మేమంతా ఫ్రెండ్స్. సమ్మర్లో బోలెడంత గ్యాప్ ఉంది. పెద్ద సినిమాలు ఏమీ లేవు. నెలకి ఒక్క సినిమా వచ్చినా చాలు. ఇప్పుడే డిస్ట్రిబ్యూటర్స్ మీద రుద్దేసి తప్పు చేశాం. మళ్ళీ అలా జరగకూడదు.
 
చిరంజీవి సినిమా ఎప్పుడు??
-పారడైజ్ అయిపోయిన వెంటనే అది మొదలుపెడతాం. అది పిరియాడిక్  బ్యాక్ డ్రాప్ కథ.  
-అలాగే  కిషోర్ తిరుమలతో ఒక లవ్ స్టోరీ చేయబోతున్నాం. నటీనటులు ఎవరన్నది ఇంకా ఖరారు కాలేదు.
-నాకు అరుంధతి లాంటి సినిమా చేయాలన్న ఉంది. అలాంటి ఒక కథపై కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి.

కొత్త వాళ్ళని చాలా ఎంకరేజ్ చేస్తున్నారు కదా?
-అవునండి శ్రీకాంత్ ని దసరాతో పరిచయం చేశాం. అలాగే కేజే క్యూ దర్శకుడు కూడా కొత్తవారే. ఆ సినిమా కూడా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అలాగే దుల్కర్ తో చేస్తున్న సినిమా కూడా కొత్త దర్శకుడే. దుల్కర్,  పూజ హెగ్డే కలిసి చేస్తున్న సినిమా అద్భుతంగా వస్తోంది. వాళ్ల కాంబినేషన్ చాలా బాగుంటుంది  

-మేము కొత్త డైరెక్టర్స్ కి చాలా ఫ్రీగా ఫ్రీడం ఇస్తాము. దుల్కర్ సినిమా అమెరికాలో దాదాపు 35 రోజులు షూటింగ్ ఉంటుంది.

మీకు డ్రీమ్ ప్రాజెక్ట్ ఉందా?
-ఇండస్ట్రీలో అందరూ గొప్పగా చెప్పుకునే సినిమా ఒకటి తీయాలని ఉంటుంది. ఆ కల పారడైజ్ తో తీరిపోతుందని నమ్మకం ఉంది.  పారడైజ్ 60 శాతం షూటింగ్ కంప్లీట్ అయింది. ఈ సినిమాని దాదాపు అన్నీ సెట్స్ లో షూట్ చేస్తున్నాం. సినిమా అద్భుతంగా వస్తోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com