ఆ రెండు కేసుల్లోనే అబార్షన్..షురా కౌన్సిల్ ఆమోదం..!!
- March 09, 2026
మనామా: అబార్షన్ కు సంబంధించి మినహాయింపు పై షురా కౌన్సిల్ క్లారిటీ ఇచ్చింది.తాజాగా కౌన్సిల్ ఆమోదించిన ప్రతిపాదన ప్రకారం ప్రాణాంతకమైన పిండం లోపాలు మరియు తల్లికి ప్రమాదం అనే రెండు సందర్భాల్లోనే చట్టపరమైన గర్భస్రావం(అబార్షన్) క అనుమతిస్తారు.
మిగతా సందర్భాల్లో అబార్షన్ కు వెళ్లడాన్ని క్రిమినల్ నేరంగా పరిగణిస్తారు. సంబంధిత అధికారుల నుంచి అనుమతి, నిపుణుల నివేదికలు ఉన్న కేసుల్లో లైసెన్స్ పొందిన ఆసుపత్రులలో మాత్రమే అబార్షన్ కు అనుమతిస్తారని సర్వీసెస్ కమిటీ అధిపతి డాక్టర్ జమీలా అల్ సల్మాన్ స్పష్టం చేశారు.గల్ఫ్ అంతటా చట్టాలను పరిశీలించి ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.
ఇక అబార్షన్ కు బహ్రెయిన్‌లో ప్రాక్టీస్ చేయడానికి లైసెన్స్ పొందిన ముగ్గురు కన్సల్టెంట్ వైద్యులతో కూడిన వైద్య కమిటీ ధృవీకరించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. అలాగే, సంబంధిత నిపుణుల పర్యవేక్షణలోనే అబార్షన్ ప్రక్రియను నిర్వహించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.ఎమర్జెన్సీ సందర్భాల్లో మినహా సదరు మహిళ రాతపూర్వక అనుమతి కూడా అవసరం అవుతుందని డాక్టర్ జమీలా అల్ సల్మాన్ వెల్లడించారు.
తాజా వార్తలు
- కాంగోలో కుప్పకూలిన విమానం..14 మంది మృతి
- బహ్రెయిన్ చారిత్రక ప్రాంతాల పునరుద్ధరణకు చర్యలు..!!
- ఖతార్‌లో తాత్కాలికంగా ట్రాఫిక్ ఆంక్షలు.. వాటర్ లైన్ నిర్వహణ పనులు..!!
- లండన్‌లో ‘లివ్ ఒమన్’ ఎగ్జిబిషన్ ప్రారంభం..!!
- సౌదీ అరేబియాకు రక్షణగా..మక్కా ఒప్పందం అమలుపై కీలక నిర్ణయం..!!
- కువైట్‌లో ర్యాష్ డ్రైవింగ్‌పై కఠిన చర్యలు..!!
- దుబాయ్‌లో అనధికార ఆక్యుపెన్సీపై కఠిన చర్యలు..!!
- గణేష్ నిమజ్జనాలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి: డీజీపీ సీవీ ఆనంద్
- ఆసియా క్రీడల విజేతలకు సీఎం విజయ్ భారీ నగదు బహుమతి
- హత్యకు గురైన వ్యక్తి భార్య, కుమారుడు అదృశ్యమయ్యారన్న వార్తలను ఖండించిన షార్జా పోలీసులు







