UNRWAకు మద్దతు కొనసాగుతుంది: ఖతార్
- January 21, 2026
దోహా: ఖతార్ UNRWAకు భౌతికంగా, నైతికంగా మరియు రాజకీయంగా మద్దతు ఇవ్వడం కొనసాగిస్తుందని ఖతార్ ప్రధానమంత్రి సలహాదారు మరియు విదేశాంగ మంత్రిత్వ శాఖ (MoFA) ప్రతినిధి డాక్టర్ మాజెద్ మొహమ్మద్ అల్-అన్సారీ తెలిపారు.
UNRWAకు మరియు అన్ని ఐక్యరాజ్యసమితి ఏజెన్సీలకు వారి మిషన్లను నిర్వహించడంలో మద్దతు ఇవ్వాలని అంతర్జాతీయ సమాజాన్ని కోరారు. ఈ మిషన్లకు ప్రమాదం కలిగించడానికి, అంతర్జాతీయ చట్టబద్ధతను బలహీనపరచడానికి లేదా అంతర్జాతీయ సంస్థల పనికి ఆటంకం కలిగించడానికి అనుమతించవద్దని పిలుపునిచ్చారు.
తూర్పు జెరూసలేంలో UNRWA ఫెసిలిటీస్ కూల్చివేతలపై ఖతార్ తీవ్రంగా మండిపడింది. పాలస్తీనా శరణార్థుల కోసం ఐక్యరాజ్యసమితి సహాయ మరియు కార్యనిర్వాహక సంస్థ (UNRWA) తన పనిని నిర్వహించడంలో మద్దతు ఇవ్వవలసిన ఆవశ్యకతపై తమ వైఖరి మారదని స్పష్టం చేశారు. ఇజ్రాయెల్ చర్యల వల్ల పాలస్తీనా పౌరుల జీవితాలు మరింత దిగజారుతాయని ఆందోళన వ్యక్తంచేశారు.
బోర్డ్ ఆఫ్ పీస్‌లో ఖతార్ చేరిందని, ఖతార్ మొదటి రోజు నుండే ఈ ఫ్రేమ్‌వర్క్‌లో పాలుపంచుకుందని, ముఖ్యంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ 20-సూత్రాల ప్రణాళికకు సంబంధించి షర్మ్ ఎల్-షేక్‌లో ఒప్పందంపై సంతకం చేసిన పక్షాలలో ఖతార్ కూడా ఒకటి అని అల్ అన్సారీ తెలియజేశారు.
తాజా వార్తలు
- గణేష్ నిమజ్జనాలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి: డీజీపీ సీవీ ఆనంద్
- ఆసియా క్రీడల విజేతలకు సీఎం విజయ్ భారీ నగదు బహుమతి
- హత్యకు గురైన వ్యక్తి భార్య, కుమారుడు అదృశ్యమయ్యారన్న వార్తలను ఖండించిన షార్జా పోలీసులు
- ఏపీలో టాటా పవర్..చిత్తూరులో ఈవీ ఛార్జింగ్ స్టేషన్
- దుబాయ్‌లో భారతీయ కార్మికుల సమస్యలపై చర్చలు
- యూఎన్‌లో పాక్-బంగ్లా కీలక భేటీ
- విశాఖలో విషాదం.. ఆంధ్ర మెడికల్ కాలేజీ విద్యార్థిని ఆత్మహత్య
- జల మార్గాల భద్రత, పౌరుల రక్షణ.. ఐరాసలో బహ్రెయిన్ కీలక వ్యాఖ్యలు..!!
- నాటో చీఫ్, ఐర్లాండ్ ప్రధాని తో కువైట్ క్రౌన్ ప్రిన్స్ భేటీ..!!
- గ్లోబల్ పోటీతత్వంలో సౌదీ అరేబియాకు 13వ స్థానం..!!







