కువైట్ లో టెలికమ్యూనికేషన్ సేవలు ఆధునికీకరణ..!!

- November 10, 2026 , by Maagulf
కువైట్ లో టెలికమ్యూనికేషన్ సేవలు ఆధునికీకరణ..!!
కువైట్: కువైట్ లో టెలికమ్యూనికేషన్ సేవలను ఆధునికీకరించే చర్యల్లో భాగంగా కాపర్ నెట్‌వర్క్ నుంచి ఫైబర్ ఆప్టిక్ నెట్‌వర్క్‌కు మారాలని కమ్యూనికేషన్స్ మంత్రిత్వ శాఖ నివాసితులకు సూచించింది. ఇప్పటివరకు తమ టెలిఫోన్, టెలికమ్యూనికేషన్ సేవలను కాపర్ నెట్‌వర్క్ నుంచి ఫైబర్ ఆప్టిక్ వ్యవస్థకు మార్చుకోని వారు వెంటనే సల్మియా టెలిఫోన్ ఎక్స్ఛేంజ్‌ను సందర్శించి కనెక్షన్ మార్పు కోసం దరఖాస్తు చేసుకోవాలని కోరింది.
 
సల్వా, రుమైతియా, బిదా, మైదాన్ హవల్లి ప్రాంతాలతో పాటు సల్మియాలోని 10, 11 బ్లాకులకు చెందిన వినియోగదారులు ఈ సూచనలను పాటించాలని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.
 దేశ టెలికమ్యూనికేషన్ మౌలిక సదుపాయాలను ఆధునికీకరించడం, సేవల నాణ్యతను మెరుగుపరచడం, వినియోగదారులకు మరింత సమర్థవంతమైన సేవలు అందించడం లక్ష్యంగా ఈ మార్పులు చేపడుతున్నట్లు తెలిపింది.
 
ఈ ప్రకటన వెలువడిన 30 రోజుల తర్వాత కాపర్ నెట్‌వర్క్ ద్వారా కొనసాగుతున్న సేవలను నిలిపివేస్తామని హెచ్చరించింది. అందువల్ల ప్రభావిత ప్రాంతాల్లోని వినియోగదారులు చివరి నిమిషం వరకు వేచి ఉండకుండా సల్మియా టెలిఫోన్ ఎక్స్ఛేంజ్‌కు వెళ్లి అవసరమైన మార్పిడి ప్రక్రియను పూర్తి చేసుకోవాలని మంత్రిత్వ శాఖ సూచించింది.
Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com