హమద్ విమానాశ్రయంలో ఉచితంగా షార్ట్ ఫిల్మ్స్ ప్రదర్శన..!!
- November 10, 2026
దోహా: ఖతార్‌లోని హమద్ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రయాణికులకు వినూత్నమైన వినోదాన్ని అందిస్తోంది. దోహా ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ (DFI) సహకారంతో ‘మేడ్ ఇన్ ఖతార్’ పేరుతో రూపొందించిన షార్ట్ ఫిల్మ్స్‌ను ఉచితంగా ప్రదర్శిస్తోంది. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రయాణికులకు ఉచితంగా పాప్‌కార్న్ కూడా అందిస్తున్నారు.
ఈ ప్రత్యేక స్క్రీనింగ్ రూమ్‌లో ఖతార్‌కు చెందిన, అలాగే ఖతార్‌లో నివసిస్తూ సినిమాలు రూపొందిస్తున్న దర్శకుల చిత్రాలను ప్రదర్శిస్తున్నారు. స్థానిక సినీ పరిశ్రమలోని ప్రతిభను, కథలను అంతర్జాతీయ ప్రయాణికులకు పరిచయం చేయడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని ప్రకటించారు.
విమానాశ్రయంలోని కాంకోర్స్ Dలో, లాంకోమ్ కేఫ్ పక్కనే ఈ స్క్రీనింగ్ రూమ్‌ను ఏర్పాటు చేశారు. విమాన ప్రయాణానికి ముందుగా చేరుకున్నవారు, ఇతర విమానాల కోసం ట్రాన్సిట్‌లో వేచి ఉన్నవారు ఇక్కడ సినిమాలను ఉచితంగా వీక్షించవచ్చు.
ఈ ప్రత్యేక సినిమా ప్రదర్శనలు 2026 డిసెంబర్ 27 వరకు కొనసాగనున్నాయి. ప్రదర్శించే సినిమాలు, కార్యక్రమానికి సంబంధించిన పూర్తి వివరాలను హమద్ అంతర్జాతీయ విమానాశ్రయం అధికారిక వెబ్సైట్లో తెలుసుకోవచ్చని వెల్లడించారు.
తాజా వార్తలు
- తాజా ప్రాంతీయ పరిస్థితులపై సౌదీ, ఒమన్ చర్చలు..!!
- హమద్ విమానాశ్రయంలో ఉచితంగా షార్ట్ ఫిల్మ్స్ ప్రదర్శన..!!
- కువైట్ లో టెలికమ్యూనికేషన్ సేవలు ఆధునికీకరణ..!!
- ట్రంప్ సంచలన నిర్ణయం..
- విడాకులు తీసుకున్నట్లు ప్రకటించిన పవన్–అన్నా లెజినోవా
- యూఏఈలో వాహనాల సంఖ్యపై పరిమితి అమలు వాయిదా..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర కంటెంట్.. యువతి అరెస్ట్..!!
- ఒమన్ డేమానియాత్ దీవుల్లో అండర్‌వాటర్ మ్యూజియం..!!
- డ్రైవింగ్ సమయంలో మొబైల్ ఫోన్ వాడొద్దు..
- మూడు దశాబ్దాలకు పైగా ప్రవాసాంధ్రులకు సేవలు.. ఉద్యోగ విరమణ చేసిన జాన్ సుందర్ శీలా







