తాజా ప్రాంతీయ పరిస్థితులపై సౌదీ, ఒమన్ చర్చలు..!!

- November 10, 2026 , by Maagulf
తాజా ప్రాంతీయ పరిస్థితులపై సౌదీ, ఒమన్ చర్చలు..!!

రియాద్: మిడిలిస్టులో తాజా పరిణామాలు, ప్రాంతీయ భద్రత, సముద్ర మార్గాల రక్షణపై సౌదీ అరేబియా, ఒమన్ విదేశాంగ మంత్రులు చర్చించారు. సోమవారం సౌదీ విదేశాంగ మంత్రి ప్రిన్స్ ఫైసల్ బిన్ ఫర్హాన్, ఒమన్ విదేశాంగ మంత్రి సయ్యద్ బదర్ బిన్ హమద్ అల్ బుసైదీతో ఫోన్‌లో మాట్లాడారు.

ఈ సందర్భంగా మిడిలిస్టులో వేగంగా చోటుచేసుకుంటున్న తాజా పరిణామాలపై ఇరువురు మంత్రులు అభిప్రాయాలను పంచుకున్నారు. సంక్షోభాన్ని అదుపులోకి తీసుకురావడానికి దౌత్యపరమైన ప్రయత్నాలను కొనసాగించాల్సిన అవసరాన్ని చెప్పారు.
 
అలాగే అంతర్జాతీయ సముద్ర రవాణా, నౌకాయాన మార్గాలకు భద్రత కల్పించడం, తాజా పరిణామాల ప్రభావం ప్రాంతీయ భద్రత, స్థిరత్వంపై పడకుండా చర్యలు తీసుకోవడంపై చర్చించారు. సంక్షోభ పరిష్కారానికి దౌత్య మార్గాలే కీలకమని ఇరువురు మంత్రులు అభిప్రాయపడ్డారు.
Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com