షార్జా క్యాంపెయిన్‌ ద్వారా వర్కర్స్‌కి జాకెట్స్‌

- July 28, 2016 , by Maagulf
షార్జా క్యాంపెయిన్‌ ద్వారా వర్కర్స్‌కి జాకెట్స్‌

షార్జా లేబర్‌ స్టాండర్డ్స్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ, అవేర్‌నెస్‌ క్యాంపెయిన్‌ని 'వి కేర్‌ ఫర్‌ యువర్‌ కంఫర్ట్‌' నినాదంతో చేపట్టింది. ఆరోగ్యకరమైన, భద్రతతో కూడిన వాతావరణాన్ని కార్మికులకు కల్పించేందు కోసం ఈ అవేర్‌నెస్‌ క్యాంపెయిన్‌ని ప్రారంభించారు. ఈ క్యాంపెయిన్‌లో భాగంగా కార్మికులకు ప్రత్యేకమైన జాకెట్లను అందించనున్నారు. బయటి వేడిమి నుంచి ఈ జాకెట్స్‌ ఉపశమనాన్ని కల్పిస్తాయి. ఈ ప్రోగ్రామ్‌ ద్వారా యూనివర్సిటీ ఆఫ్‌ షార్జా క్యాంపస్‌ పరిసరాల్లో పనిచేసే కార్మికులకు ముందుగా ఉపశమనం లభించనుంది. కార్మికులకు మరింత భద్రతను అందించడం ద్వారా యూఏఈ ప్రపంచ పటంలో ప్రత్యేకమైన స్థానాన్ని దక్కించుకునేలా చెయ్యాలన్నదే తమ ఆకాంక్ష అని లేబర్‌ స్టాండర్డ్స్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ ఛైర్మన్‌ సలెమ్‌ యూసెఫ్‌ అల్‌ కసీర్‌ చెప్పారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com