'డెకాయిట్' తన పోర్షన్ షూటింగ్ పూర్తి చేసుకున్న మృణాల్ ఠాకూర్
- January 21, 2026
వరుస బ్లాక్‌బస్టర్‌లతో దూసుకుపోతున్న అడివి శేష్ ఇప్పుడు తన ప్రతిష్టాత్మకమైన చిత్రం 'డకాయిట్'తో అలరించబోతున్నారు.ఈ చిత్రంతో షానియల్ డియో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.ఇందులో మృణాల్ ఠాకూర్ కథానాయికగా నటిస్తుండగా, ప్రముఖ దర్శకుడు అనురాగ్ కశ్యప్ ఒక ముఖ్య పాత్ర పోషిస్తున్నారు.
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. తాజాగా మృణాల్ ఠాకూర్ తన పాత్రకు సంబంధించిన షూటింగ్‌ను పూర్తి చేసుకున్నారు. ఒక భారీ షెడ్యూల్‌లో తన షూటింగ్ ఫినిష్ చేశారు. చిత్ర బృందం ఆమెకు ఘనంగా సెండ్ అఫ్ ఇచ్చింది, ఆమె అన్ని ప్రమోషనల్ యాక్టివిటీస్ భాగమవుతారు. ఆమె తన పాత్రకు తెలుగు, హిందీ రెండు భాషలలో డబ్బింగ్ కూడా చెబుతున్నారు.
ఇటీవల, చిత్ర నిర్మాతలు రిలీజ్ చేసిన సినిమా టీజర్ కు అద్భుతమైన స్పందన లభించింది. శేష్ డిఫరెంట్ అవతార్, రఫ్ లుక్‌ల, మాస్ యాటిట్యూడ్‌తో అందరినీ ఆకట్టుకున్నారు.
ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్, అతుల్ కులకర్ణి,సునీల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రం ఉన్నత నిర్మాణ విలువలతో రూపొందుతోంది.సినిమాటోగ్రఫీని ధనుష్ భాస్కర్ అందించగా, భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్ అందిస్తున్నారు.నేపథ్య సంగీతాన్ని జ్ఞాని అందించారు.
సుప్రియ యార్లగడ్డ నిర్మించిన ఈ చిత్రానికి సునీల్ నారంగ్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ ఈ చిత్రాన్ని సమర్పిస్తోంది.మార్చి 19, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానున్న ఈ చిత్రం, తెలుగు నూతన సంవత్సరం అయిన ఉగాది పండుగ సందర్భంగా గ్రాండ్ గా విడుదలవుతోంది.
తాజా వార్తలు
- న్యూజిలాండ్ పై టీమిండియా ఘన విజయం
- ఈనెల 24 నుంచి ‘విశాఖ ఉత్సవం’
- పార్టీలకు, నేతలకు వెంకయ్య నాయుడు సూచన
- బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అభ్యర్థనను తోసిపుచ్చిన ICC
- అటల్ పెన్షన్ యోజనకు గ్రీన్ సిగ్నల్!
- సెయింట్ లూయిస్‌లో NATS ఉచిత వైద్య శిబిరం
- మళ్లీ దుందుడుకు చర్యలకు పాల్పడ్డ పాకిస్థాన్..
- ప్రపంచ దేశాల సహకారంతోనే ఉగ్రవాదం పై విజయం: మంత్రి జైశంకర్
- సౌదీ అరేబియాలో 'స్పియర్స్ ఆఫ్ విక్టరీ 2026' ప్రారంభం..!!
- ఇండియాకు డబ్బు పంపడానికి ఇదే సరైన సమయమా?







