వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ తో సౌదీ అరేబియా ఒప్పందం..!!
- January 22, 2026
దావోస్: సౌదీ అరేబియా పరిశ్రమ మరియు ఖనిజ వనరుల మంత్రి బందర్ అల్ఖోరాయెఫ్ మరియు వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ (WEF) అధ్యక్షుడు బోర్జ్ బ్రెండే సహకార ఒప్పందంపై సంతకాలు చేశారు. స్విట్జర్లాండ్లోని దావోస్లో జరిగే ప్రపంచ ఆర్థిక వేదిక 2026 సందర్భంగా విదేశాంగ మంత్రి ప్రిన్స్ ఫైసల్ బిన్ ఫర్హాన్ సమక్షంలో సంతకాల కార్యక్రమం జరిగింది.
సౌదీ అరేబియాలో పారిశ్రామిక రంగంలో కీలక సంస్కరణలను చేపట్టేందుకు ఈ ఒప్పందం దోహదం చేస్తుందని తెలిపారు. మోడ్రన్ టెక్నాలజీని ప్రోత్సహించడం కూడా లక్ష్యంగా పెట్టుకున్నట్లు మంత్రిత్వశాఖ తెలిపింది. ప్రాంతీయంగా మరియు ప్రపంచవ్యాప్తంగా సౌదీని ఒక ప్రముఖ పారిశ్రామిక శక్తిగా మార్చడానికి, జాతీయ ఆర్థిక వ్యవస్థ వైవిధ్యీకరణను గరిష్ఠ స్థాయికి పెంచడానికి ఉద్దేశించిన సౌదీ విజన్ 2030 లక్ష్యాలకు అనుగుణంగా ఈ ఒప్పందం చేసుకున్నట్లు వెల్లడించింది.
తాజా వార్తలు
- ఖతార్ అల్ వక్రా పోర్టులో అగ్నిప్రమాదం..!!
- సౌదీ సార్వభౌమత్వ రక్షణకు రాజీ పడబోము..!!
- యూఎన్- బహ్రెయిన్ భాగస్వామ్యం.. కీలక రంగాల్లో పురోగతి..!!
- సబ్సిడీ డీజిల్ చోరీ కేసుల్లో 21 ట్యాంకర్లు, ట్రక్కులు సీజ్..!!
- కువైట్లో భారతీయ నర్సు మృతి..!!
- యూఏఈ స్కూళ్లలో స్కాలర్షిప్లు.. 50 శాతం వరకు ఫీజు రాయితీ..!!
- ది హేగ్ ఎంబసీ ఫెస్టివల్లో ఒమన్ సాంస్కృతిక వైభవం..!!
- అక్టోబర్ 7 దాడుల కథనంపై స్పందించిన ఎమిరేట్స్..!!
- సౌదీలో 5 రోజులపాటు వర్షాలు.. ప్రజలకు హెచ్చరిక..!!
- యూకేలో టెక్నికల్ ప్రాబ్లమ్.. ఖతార్ ఎయిర్వేస్ విమానాలకు అంతరాయం..!!







