ఒమన్ లో 31వేల మంది కార్మికుల పై కేసులు నమోదు..!!

- January 24, 2026 , by Maagulf
ఒమన్ లో 31వేల మంది కార్మికుల పై కేసులు నమోదు..!!

మస్కట్: 2025 లో సాధించిన విజయాలు మరియు చేపట్టిన కార్యక్రమాలను ఒమన్ కార్మిక మంత్రిత్వ శాఖ తన వార్షిక మీడియా సమావేశంలో వివరించింది.  కార్మిక సంక్షేమ బృందాలు నిర్వహించిన 15,000 తనిఖీ పర్యటనలలో నిబంధనలను ఉల్లంఘించినందుకు 31,000 మందికి పైగా కార్మికులు పట్టుబడ్డారని తెలిపింది. మానవ వనరుల నిర్వహణ కోసం ఎజాదా ప్లాట్‌ఫారమ్‌లోని ఎలక్ట్రానిక్ ప్లాట్‌ఫారమ్‌లో 48 కంటే ఎక్కువ ప్రభుత్వ విభాగాలు పాల్గొంటున్నాయని, 80వేల మందికి పైగా ఉద్యోగులు ఈ ప్లాట్‌ఫారమ్ నుండి ప్రయోజనం పొందుతున్నారని తెలిపింది.  

కాగా, 2026లో 60వేల ఉద్యోగావకాశాలు కల్పించనున్నట్లు నివేదికలో మంత్రిత్వశాఖ స్పష్టం చేసింది. ప్రభుత్వ రంగంలో 10వేలు ప్రైవేట్ రంగంలో 33వేలు మరియు జాతీయ శిక్షణ మరియు అర్హత కార్యక్రమాల ద్వారా 17వేలు ఉద్యోగాలు కల్పించనున్నట్లు తెలిపింది. 2025లో 36,413 ఉద్యోగావకాశాలు కల్పించినట్టు, దీనితో పాటు ఉపాధి శిక్షణా కార్యక్రమాల ద్వారా 15,069 ఉద్యోగావకాశాలు కల్పించినట్లు వెల్లడించారు.   

వివిధ రంగాలలో 18 కమిటీల ద్వారా 2025లో 13వేల ఉద్యోగావకాశాలు కల్పించామని, ఫ్రీలాన్స్ పని వ్యవస్థలో 2,300 మంది నిపుణులు నమోదు చేసుకున్నారని తెలిపింది.  టెక్నాలజీ, నాయకత్వ స్థానాలలో 4 వేల మందికి పైగా ఉన్న విదేశీయుల స్థానంలో స్వదేశీయులను నియమించినట్టు పేర్కొంది.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com