సౌదీ అరేబియాలో ఉరుములతో కూడిన రెయిన్స్..!!
- January 25, 2026
జెడ్డా: సౌదీ అరేబియాలోని పలు ప్రాంతాల్లో ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయని నేషనల్ సెంటర్ ఫర్ మెటియోరాలజీ (NCM అలెర్ట్ జారీ చేసింది. మక్కా ప్రాంతంలోని జెడ్డా, ఖులైస్, అల్-కామిల్, రాబిగ్, అధమ్ మరియు బహ్రా సహా పలు గవర్నరేట్‌లలో ఉరుములతో కూడిన తేలికపాటి నుండి మోస్తరు వర్షపాతం కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. వర్షాల కారణంగా విజిబిలిటీ తగ్గుతుందని, ఆకస్మిక వరదలు వచ్చే అవకాశం ఉందని, తీర ప్రాంతాలలో అలలు భారీగా ఎగసిపడతాయని కేంద్రం తెలిపింది.
అలాగే, మదీనా, ఖాసిం, హైల్, తబూక్, అల్-జౌఫ్, నార్తర్న్ బోర్డర్స్ మరియు తూర్పు ప్రావిన్స్‌లోని కొన్ని ప్రాంతాలలో, అలాగే రియాద్ ప్రాంతంలోని ఉత్తర ప్రాంతాలలో ఉరుములతోపాటు మోస్తరు నుండి భారీ వర్షాలు, వడగళ్ళు మరియు దుమ్ము రేపే గాలులతో పాటు ఆకస్మిక వరదలు సంభవించే అవకాశం ఉందని కేంద్రం హెచ్చరించింది.
తాజా వార్తలు
- ఒమన్‌లో 2.56 లక్షలకు వృద్ధుల సంఖ్య..!!
- Four astronauts reach International Space Station in record time
- సౌదీలో హౌతీ బాలిస్టిక్ మిసైల్ కూల్చివేత..!!
- అక్టోబర్ నెలంతా దేశవ్యాప్త నిరసనలు.. CJP కీలక పిలుపు
- పైలట్ స్మిత్ మచ్చర్ కోలుకుంటున్నారు..భారత రాయబారి..!!
- మదీనాలో హౌతీ దాడి.. తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- షార్జా జ్యువెలరీ షోలో ప్రపంచంలోనే ఎత్తైన బంగారు బార్..
- కువైట్‌లో వర్షాలు.. తగ్గనున్న ఉష్ణోగ్రతలు..!!
- వన్డే ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల..
- భారతీయులకు గుడ్ న్యూస్..హెచ్-1బి వీసా ఫీజు పై కీలక నిర్ణయం







