తైవాన్‌లోని అత్యంత ఎత్తైన భవనాన్ని అధిరోహించిన అమెరికన్ సాహసవీరుడు..!!

- January 25, 2026 , by Maagulf
తైవాన్‌లోని అత్యంత ఎత్తైన భవనాన్ని అధిరోహించిన అమెరికన్ సాహసవీరుడు..!!

తైపీ: ఒక అమెరికన్ పర్వతారోహకుడు ఆదివారం రోప్స్, ఎలాంటి భద్రతా పరికరాలు లేకుండా తైవాన్‌లోని అత్యంత ఎత్తైన భవనాన్ని అధిరోహించాడు. ఈ సాహసోపేతమైన ఘట్టాన్ని వందలాది మంది ప్రత్యక్ష్యంగా తిలకించారు. అలాగే, నెట్‌ఫ్లిక్స్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా ఆన్‌లైన్‌లో అనేక మంది చూశారు. 

వివరాల్లోకి వెళితే.. 40 ఏళ్ల అలెక్స్ హొనాల్డ్ కు ప్రపంచంలోని అత్యంత ప్రమాదకరమైన కొండలను ఎక్కిన చరిత్ర ఉంది. 2017లో యోసెమిటీలోని "ఎల్ కాపిటన్"ను అధిరోహించడంతో పాపులర్ అయ్యాడు.  తాజాగా తైవాన్ లోని 1,667 అడుగుల (508 మీటర్లు) ఎత్తులో ఉన్న తైపీ 101 భవనాన్ని ఒకటిన్నర గంట సమయంలో అధిరోహించి, మరోసారి వార్తల్లో నిలిచాడు. 

అయితే, 2004లో "ఫ్రెంచ్ స్పైడర్‌మ్యాన్" అని పిలవబడే అలైన్ రాబర్ట్ ఈ ఎత్తైన భవనాన్ని అధిరోహించిన మొదటి వ్యక్తిగా గుర్తింపు పొందారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com