యూఏఈ ఇన్ఫ్లుయెన్సర్లకు బిగ్ అలర్ట్

- January 25, 2026 , by Maagulf
యూఏఈ ఇన్ఫ్లుయెన్సర్లకు బిగ్ అలర్ట్
దుబాయ్: మీరు యూఏఈలో (UAE) టిక్టాక్, ఇన్స్టాగ్రామ్ లేదా యూట్యూబ్లో వీడియోలు చేస్తున్నారా? బ్రాండ్లను ప్రమోట్ చేస్తున్నారా? అయితే ఈ వార్త మీకోసమే. కొత్త మీడియా చట్టం ప్రకారం, సోషల్ మీడియాలో 'స్పాన్సర్డ్ కంటెంట్' (Sponsored Content) పోస్ట్ చేసే ప్రతి ఒక్కరూ 'అడ్వర్టైజర్ పర్మిట్' (Advertiser Permit) తీసుకోవడం తప్పనిసరి.
దీనికి సంబంధించిన గడువు జనవరి 31, 2026 తో ముగియనుంది. ఈలోపు పర్మిట్ తీసుకోకపోతే భారీ జరిమానాలు తప్పవని యూఏఈ మీడియా కౌన్సిల్ హెచ్చరించింది.
 
అసలేంటి ఈ రూల్?
2025లో అమల్లోకి వచ్చిన కొత్త ఫెడరల్ మీడియా లా (చట్టం నం. 55 of 2023) ప్రకారం.. ప్రింట్, డిజిటల్ మరియు సోషల్ మీడియా ప్లాట్ఫారమ్లన్నింటికీ కఠిన నిబంధనలు విధించారు.
ఎవరికి వర్తిస్తుంది: సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు, కంటెంట్ క్రియేటర్లు మరియు అడ్వర్టైజర్లు.
ముఖ్య గమనిక: మీరు డబ్బు తీసుకుని ప్రమోట్ చేసినా, లేదా ఉచితంగా (Free of charge) ప్రమోట్ చేసినా.. అది 'యాడ్' కిందకే వస్తుంది కాబట్టి పర్మిట్ తప్పనిసరి.
జరిమానాలు (Fines) చూస్తే గుండె గుభేల్!
పర్మిట్ లేకుండా లేదా నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తిస్తే 10 వేల నుండి ఏకంగా 10 లక్షల దిర్హమ్స్ వరకు జరిమానా విధించే అవకాశం ఉంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి:
లైసెన్స్ లేకుండా ఆపరేట్ చేస్తే:
o మొదటి తప్పుకు: Dh 10,000
o రెండోసారి దొరికితే: Dh 40,000
తప్పుడు సమాచారం (Fake News) ప్రచారం చేస్తే:
o మొదటి తప్పుకు: Dh 5,000
o మళ్లీ చేస్తే: Dh 10,000
దేశ ప్రయోజనాలకు భంగం కలిగిస్తే:
o జాతీయ చిహ్నాలు లేదా ప్రభుత్వ వ్యవస్థలను అగౌరవపరిస్తే: Dh 50,000 నుండి Dh 5,00,000
o విదేశీ సంబంధాలను దెబ్బతీసేలా పోస్టులు పెడితే: Dh 2,50,000 వరకు
తీవ్రమైన నేరాలు:
o మతపరమైన మనోభావాలు దెబ్బతీయడం లేదా హింసను ప్రేరేపించడం వంటి తీవ్రమైన తప్పులకు 1 మిలియన్ దిర్హమ్స్ (Dh 1,000,000) వరకు జరిమానా ఉంటుంది.
పర్మిట్ ఎలా పొందాలి? ఖర్చు ఎంత?
కంటెంట్ క్రియేటర్లకు గుడ్ న్యూస్ ఏంటంటే.. యూఏఈ పౌరులు మరియు రెసిడెంట్లకు ఈ పర్మిట్ ప్రస్తుతం ఉచితంగా (Free of charge) ఇస్తున్నారు. దీని వాలిడిటీ 3 సంవత్సరాలు ఉంటుంది.
 
అర్హతలు:
1. వయసు 18 ఏళ్లు నిండాలి.
2. యూఏఈ రెసిడెంట్ అయ్యుండాలి.
3. ఎలక్ట్రానిక్ మీడియా నిర్వహించడానికి సరైన ట్రేడ్ లైసెన్స్ కలిగి ఉండాలి.
 
ఏం చేయాలి?
మీరు కంటెంట్ క్రియేటర్ అయితే, వెంటనే ఆన్లైన్లో 'అడ్వర్టైజర్ పర్మిట్' కోసం దరఖాస్తు చేసుకోండి. అలాగే, యూఏఈ మీడియా కౌన్సిల్ విడుదల చేసిన 20 కంటెంట్ స్టాండర్డ్స్ (ప్రమాణాలు) కచ్చితంగా పాటించండి. గడువు జనవరి 31, 2026 లోపే అని గుర్తుంచుకోండి!
 
--బాజీ షేక్(యూఏఈ)
Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com