అభిమానికి గోల్డ్ చెయిన్ గిఫ్ట్‌గా ఇచ్చిన తలైవా
- January 25, 2026
చెన్నై: సూపర్ స్టార్ రజనీకాంత్ మంచి మనసును చాటుకున్నారు. తమిళనాడులోని మధురైలో శేఖర్ అనే వ్యక్తి.. పరోటా షాప్ నడుపుతున్నాడు. గత 13 ఏళ్ల నుంచి కేవలం 5 రుపాయలకే పరోటా అమ్ముతున్నాడు. గతంలో ఇతడికి సంబంధించిన పలు ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. ఇతని పేరు శేఖర్ అయినప్పటికీ అందరూ రజనీకాంత్ శేఖర్ అని పిలుస్తుంటారు. ఎందుకంటే ఇతను సూపర్ స్టార్ కు వీరాభిమాని. ఈ క్రమంలోనే తాజాగా రజనీ నుంచి శేఖర్ కుటుంబానికి పిలుపు వచ్చింది. ఈ సందర్భంగా కుటుంబ సమేతంగా శేఖర్ ను ఇంటికి ఆహ్వానించిన రజనీకాంత్.. అతనికి బంగారు చెయిన్ బహుమతిగా ఇచ్చారు.
ఇక సినిమాల విషయానికొస్తే, రజనీకాంత్ ప్రస్తుతం నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో ‘జైలర్ 2’ చిత్రం పనుల్లో నిమగ్నమై ఉన్నారు. మరోవైపు, తన తదుపరి చిత్రం గురించిన కీలక అప్డేట్ను కూడా అభిమానులతో పంచుకున్నారు. ఇటీవలే పొంగల్ పండుగ సందర్భంగా తన ఇంటి వద్దకు వచ్చిన అభిమానులతో మాట్లాడుతూ, సిబి చక్రవర్తి దర్శకత్వంలో తన కొత్త సినిమా షూటింగ్ ఈ ఏడాది ఏప్రిల్‌లో ప్రారంభమవుతుందని స్వయంగా వెల్లడించారు. ఇది ఒక పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్గా ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- అదృష్టం కాదు.. ప్రణాళికే గల్ఫ్ దేశాల ఆర్థిక బలానికి కారణం..!!
- ఒమన్‌లో 2.56 లక్షలకు వృద్ధుల సంఖ్య..!!
- Four astronauts reach International Space Station in record time
- సౌదీలో హౌతీ బాలిస్టిక్ మిసైల్ కూల్చివేత..!!
- అక్టోబర్ నెలంతా దేశవ్యాప్త నిరసనలు.. CJP కీలక పిలుపు
- పైలట్ స్మిత్ మచ్చర్ కోలుకుంటున్నారు..భారత రాయబారి..!!
- మదీనాలో హౌతీ దాడి.. తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- షార్జా జ్యువెలరీ షోలో ప్రపంచంలోనే ఎత్తైన బంగారు బార్..
- కువైట్‌లో వర్షాలు.. తగ్గనున్న ఉష్ణోగ్రతలు..!!
- వన్డే ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల..







