పద్మ అవార్డులు అందుకున్న సినీ ప్రముఖులు వీళ్ళే..
- January 25, 2026
న్యూ ఢిల్లీ: నేడు కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డులను ప్రకటించింది. అన్ని రంగాలలో కలిపి ఐదుగురికి పద్మ విభూషణ్, 13 మందికి పద్మ భూషణ్, 113 మందికి పద్మశ్రీ పురస్కారాలు ప్రకటించారు. ఇందులో సినిమా రంగం నుంచి కూడా పలువురు ఈ అవార్డులు సాధించారు.
గత సంవత్సరం నవంబర్ లో బాలీవుడ్ స్టార్ నటుడు ధర్మేంద్ర డియోల్ మరణించిన సంగతి తెలిసిందే. మరణానంతరం ఆయనకు పద్మ విభూషణ్ అవార్డు ప్రకటించారు.
మలయాళం స్టార్ హీరో మమ్ముట్టికి పద్మ భూషణ్ అవార్డు ప్రకటించారు.
బాలీవుడ్ సీనియర్ సింగర్ అల్కా యాగ్నిక్ కు పద్మ భూషణ్ అవార్డు ప్రకటించారు.
తెలుగులో రాజేంద్రప్రసాద్, మురళీ మోహన్ లకు పద్మశ్రీ అవార్డు ప్రకటించారు.
తమిళ్, తెలుగు, బాలీవుడ్ సినిమాలలో మెప్పించిన ఒకప్పటి స్టార్ హీరో మాధవన్ కి కూడా పద్మశ్రీ అవార్డు ప్రకటించారు.బాలీవుడ్ కి చెందిన నటుడు అరవింద్ వైద్యకు పద్మశ్రీ అవార్డు ప్రకటించారు.బాలీవుడ్ నటుడు సతీష్ రవిలాల్ షాకు మరణానంతరం పద్మశ్రీ ప్రకటించారు.
ఉత్తర ప్రదేశ్ నటుడు అనిల్ రస్తోగికి, బెంగాల్ నటుడు, నిర్మాత ప్రోసేన్‌జిత్ ఛటర్జీకి పద్మశ్రీ అవార్డు ప్రకటించారు.
తాజా వార్తలు
- అదృష్టం కాదు.. ప్రణాళికే గల్ఫ్ దేశాల ఆర్థిక బలానికి కారణం..!!
- ఒమన్‌లో 2.56 లక్షలకు వృద్ధుల సంఖ్య..!!
- సౌదీలో హౌతీ బాలిస్టిక్ మిసైల్ కూల్చివేత..!!
- అక్టోబర్ నెలంతా దేశవ్యాప్త నిరసనలు.. CJP కీలక పిలుపు
- పైలట్ స్మిత్ మచ్చర్ కోలుకుంటున్నారు..భారత రాయబారి..!!
- మదీనాలో హౌతీ దాడి.. తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- షార్జా జ్యువెలరీ షోలో ప్రపంచంలోనే ఎత్తైన బంగారు బార్..
- కువైట్‌లో వర్షాలు.. తగ్గనున్న ఉష్ణోగ్రతలు..!!
- వన్డే ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల..
- భారతీయులకు గుడ్ న్యూస్..హెచ్-1బి వీసా ఫీజు పై కీలక నిర్ణయం







