‘మన శంకర వర ప్రసాద్ గారు’ కు సక్సెస్ ఇచ్చినందుకు ధన్యవాదాలు: చిరంజీవి
- January 25, 2026
మెగాస్టార్ చిరంజీవి, హిట్ మెషిన్ అనిల్ రావిపూడి ల ఆల్ టైం ఇండస్ట్రీ హిట్ ‘మన శంకర వర ప్రసాద్ గారు’. విక్టరీ వెంకటేష్ కీలక పాత్రలో అలరించారు. షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లపై సాహు గారపాటి, సుస్మిత కొణిదెల నిర్మించిన ఈ చిత్రంలో నయనతార కథానాయిక నటించారు.అర్చన ఈ చిత్రాన్ని ప్రజెంట్ చేశారు. సంక్రాంతి కానుకగా ప్రపంచవ్యాప్తంగా జనవరి 12న విడుదలైన ఈ చిత్రం మెగా బ్లాక్ బస్టర్ సక్సెస్ ని అందుకొని రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్స్ తో హౌస్ ఫుల్ గా రన్ అవుతోంది.ఈ సందర్భంగా మేకర్స్ ఆల్ టైం ఇండస్ట్రీ హిట్ (రీజనల్ ఫిల్మ్స్) సెలబ్రేషన్ ని గ్రాండ్ గా నిర్వహించారు.ఈ వేడుకలో సినిమా యూనిట్, డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్ కి షీల్డ్స్ అందించారు.దర్శకులు కె రాఘవేంద్రరావు, వివి వినాయక్, నిర్మాత దిల్ రాజు, సుప్రియ యార్లగడ్డ పలువురు ప్రముఖులు ఈ వేడుకలో పాల్గొన్నారు.
ఆల్ టైం ఇండస్ట్రీ హిట్ (రీజనల్ ఫిల్మ్స్) సెలబ్రేషన్ లో మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ... అందరికీ నమస్కారం.మీ ఆనందంలో సక్సెస్ ని ప్రత్యక్షంగా చూస్తున్నాను. ఇంత పెద్ద సక్సెస్ ఇచ్చి గత వైభవాన్ని మళ్లీ పునరావృతం చేసిన తెలుగు ప్రేక్షకులందరికీ మనస్ఫూర్తిగా శిరస్సు వంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ సినిమా విజయాన్ని చూసి సుస్మిత చాలా ఎక్సైటింగ్ గా నాతో మాట్లాడింది. ఇలాంటి విజయాలు మీకు కామన్ అని చెప్పింది. సక్సెస్ ఎప్పుడూ కూడా బోర్ కొట్టదు. మనం ప్రతిరోజు తినే అన్నం కూర మనకు ఎలా అయితే బోర్ కొట్టవో విజయం ఇచ్చే ఉత్సాహం ఎప్పుడూ కూడా అద్భుతంగా ఉంటుంది. సీనియారిటీతో మెచ్యూరిటీ రావడంతో ఒక్కొక్కలా స్పందిస్తాం తప్పితే మీరందరూ ఈ విజయాన్ని ఎంతలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు అంతకంత మనసులో నేను ఆస్వాదిస్తున్నాను. ప్రజల్లోకి వెళ్ళండి వాళ్లతో ఇంట్రాక్ట్ అవ్వండి ప్రేక్షకులు ఇచ్చే కిక్కు వేరే ఉంటుందని అనిల్, సాహు తో చెప్పాను.వాళ్ళు ఇచ్చే ఉత్సాహం భవిష్యత్తులో చేసే సినిమాలకి ఒక ఇంధనం లాగా పనిచేస్తుంది.ఇలాంటి ప్రేమని నేను ఎన్నోసార్లు అనుభవించాను. అలాంటి ఉత్సాహం చాలా సంవత్సరాల తర్వాత పునరావృతం కావడం ఎంతో ఆనందంగా ఉంది.
ఎగ్జిక్యూటివ్స్ కి బయ్యర్స్ కి డిస్ట్రిబ్యూటర్స్ కి మా చేతుల మీద షీల్డ్స్ ఇవ్వడం చూస్తుంటే వింటేజ్ చిరంజీవినే కాదు వింటేజ్ ఫంక్షన్ సెలబ్రేషన్స్ కూడా తీసుకొచ్చిన క్రియేటివ్ అనిల్ దే. నిజంగా ఇది నాకు ఒక నాస్టాలజీ ఫీలింగ్.అనిల్ వర్కింగ్ వర్కింగ్ స్టైల్ చూస్తే నాకు రాఘవేంద్రరావు గుర్తు వస్తారు.ఆయనే నాకు అనిల్ ని పరిచయం చేశారు మేము కలిసి పని చేస్తే ఆ రిజల్ట్ వేరుగా ఉంటుందని ఆయన చెప్పారు.ఆయన నమ్మకం నిజమైంది.వివి వినాయక్ లాగా అనిల్ కూడా మాస్ పల్స్ తెలిసిన డైరెక్టర్.ఖైదీ 150, వాల్తేర్ వీరయ్య తర్వాత ఈ మధ్యకాలంలో అంత ఎంజాయ్ చేస్తూ షూటింగ్ చేసిన సినిమా మన శంకర వరప్రసాద్. షూటింగ్ చివరి రోజు చాలా ఎమోషనల్ అయ్యాను.యూనిట్ అందరిని దగ్గరగా తీసుకుని నా కృతజ్ఞతలు తెలియజేశాను. ఇలాంటి వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ ఇచ్చిన అనిల్ రావిపూడి కి తన రైటింగ్ టీం కి తన డైరెక్టర్ టీం కి అందరికీ థాంక్యూ.
అందరం కూడా ఒక కుటుంబంలో కలిసి పని చేశాం.సాహు, మా అమ్మాయి సుస్మిత అందరం కూడా ఒక ఫ్యామిలీ లాంటి ఫీలింగ్ తో కలిసి పని చేసాం.సినిమా షూటింగ్ సమయంలో టీం మధ్య ఒక ఫ్యామిలీ లాంటి బాండింగ్ ఉంటే దాన్ని రిజల్ట్ కచ్చితంగా సినిమా మీద ఉంటుంది. అవన్నీ కూడా సక్సెస్ఫుల్ సినిమాలే.ఇంత గొప్ప విజయాన్ని మాకు ఇచ్చినందుకు, ఇందులో వారధిలా పనిచేసిన బయ్యర్స్ కి డిస్ట్రిబ్యూటర్స్ కి ఎగ్జిబిటర్స్ కి అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తున్నాను.ఈ సంక్రాంతికి వస్తున్న ప్రతి సినిమా అద్భుతంగా ఆడాలని కోరుకున్నాను. నేను కోరుకున్నట్టే ప్రతి సినిమాని ప్రేక్షకులు ఆదరించారు. అన్ని సినిమాలకి సక్సెస్ అందించారు.అందరికీ కూడా మంచి సక్సెస్ దొరికింది. ఇది జీవితంలో మర్చిపోలేని సంక్రాంతి. నిజంగా సంక్రాంతి అదిరిపోయింది.
నా మిత్రుడు సోదరుడు ఫ్యామిలీ ఫ్రెండ్ వెంకి ఈ సినిమాలో ఉండాలని కోరుకున్నది నేనే. నేను కోరుకున్నట్టుగా ఈ సినిమాల్లో ఉండేలా చేశాడు డైరెక్టర్ అనిల్. వెంకీ సెట్ లో వున్న ప్రతిరోజు గొప్ప నవ్వులతో నిండిపోయేది. టీనేజ్ బాయ్స్ లాగా ఫీల్ అయిపోయాం. నా పాటలకి తన డాన్స్ చేయడం తన సాంగ్స్ నేను రిపీట్ చేయడం చక్కగా బ్యాలెన్స్ చేశాడు ఇద్దరు సూపర్ స్టార్స్ ని అద్భుతంగా బ్యాలెన్స్ చేసిన క్రిడెట్ అనిల్ ది,తను ప్లాన్ చేసిన విధానం అద్భుతం.అనిల్ తెలుగు సినిమా ఫ్యూచర్.ఈ సినిమా చేస్తున్నప్పుడు చేసిన ఎంజాయ్మెంట్ మళ్లీ ఎక్స్పీరియన్స్ చేయాలని ఉంది.వెంకీ నేను కలిసి చేసే ఫుల్ లెంత్ సినిమా చేస్తే వస్తే బాగుంటుందని ఆలోచన ఉంది. మా ఇద్దరినీ అద్భుతంగా బ్యాలెన్స్ చేయగలననే భరోసా అందరికీ ఇచ్చాడు అనిల్ అది అలాంటి ఆ సినిమా జరగాలని కోరుకుంటున్నాను.
నిర్మాత సాహూ ఈ సినిమా రసస్ చూసే అదిరిపోయింది అన్నాడు.నిజంగా తన ఎక్కువ మాట్లాడరు. ఆ రోజే ఈ సినిమా విజయం గురించి హింట్ ఇచ్చిన వ్యక్తి సాహూ. సుస్మిత ఇండస్ట్రీ లోకి వస్తామని అనుకున్నప్పుడు తన ఫస్ట్ రామ్ చరణ్ తో చెప్పింది.తను వెల్కం చేసాడు. రంగస్థలంలో తన కాస్ట్యుమ్స్ ను చూసుకుంది. ఆ సినిమాకి ఒక లుంగీ కావాలంటే రాజమండ్రి వీధుల్లో తనే స్వయంగా తిరిగింది. అప్పుడే కచ్చితంగా ఇండస్ట్రీలో సాధించగలదనే నమ్మకం కుదిరింది.ఈ ఇండస్ట్రీ అద్దం లాంటిది మనం ఎలా ఉంటే దాని రిసల్ట్ కూడా అలానే ఉంటుంది.తను నిర్మాత అవ్వాలనుకున్నప్పుడు వెబ్ సిరీస్ లో మొదలు పెట్టింది. అక్కడ అనుభవాన్ని సంపాదించింది. ప్రతి డిపార్ట్మెంట్ గురించి తెలుసుకుంది. తర్వాత చిన్న చిన్న హీరోలతో సినిమాలు చేసింది.నిజానికి తను అనుకుంటే మా ఫ్యామిలీలో ఎవరో ఒక హీరోతో సినిమా చేయొచ్చు. కానీ తను అలా అనుకోలేదు.ఈ సినిమా కోసం సాహూతో కలిసి తనే సొంతగా ప్రొడ్యూస్ చేసింది. ఈ సినిమా కోసం నేను నయా పైసా ఇవ్వలే.దు నాకు కావాల్సిన రెమినరేషన్ సమయానికి తగ్గట్టుగా ఆ ఇద్దరి నుంచి తీసుకున్నాను. అంత ప్రొఫెషనల్గా తన ప్రవర్తించింది. తను ఈరోజు ఈ విజయాన్ని ఆస్వాదిస్తుంది. ఒక ఫాదర్ గా సుస్మిత ను చూసి నేను గర్వపడుతున్నాను.
కొరియోగ్రాఫర్ భాను విజయ్ ఆట సందీప్ అందరికీ కూడా గొప్ప భవిష్యత్తు ఉండాలని కోరుకుంటున్నాను.ఈ సినిమాకి అద్భుతమైన లిరిక్స్ అందించిన రైటర్స్, గొప్ప మ్యూజిక్ ఇచ్చిన భీమ్స్ కి అభినందనలు. అందరూ కూడా మీసాల పిల్ల పాటకి కనెక్ట్ అయిపోయారు. అలాగే వెంకటేష్ తో నా మీద సంక్రాంతి సాంగ్ అదిరిపోయింది.ఈ సినిమా 85 రోజుల్లో పూర్తి కావడానికి ప్రధాన పాత్ర వహించింది డీఓపి సమీర్ రెడ్డి.ఈ సినిమా రిలీజ్ కి ముందే సూపర్ హిట్ అయిపోయింది అని చెప్పాను. ఎందుకంటే అనుకున్న టైం కి అనుకున్న బడ్జెట్లో సినిమాని చేయగలిగాం.ప్రకాష్ అద్భుతమైన సెట్స్ వేశారు.ఈ సినిమాలో నటించిన ప్రతి ఒక్క నటీనటులకు పేరుపేరునా అభినందనలు తెలియజేస్తున్నాను. డైరెక్టర్ అనిల్ ప్రమోషన్స్ లో దిట్ట. నయనతార ని ఒప్పించి ప్రమోషన్స్ చేయించాడు.ఈ క్యారెక్టర్ లో తను ఒదిగిపోయింది. తను ఈ సినిమాకి నిండుదనం తీసుకొచ్చింది.అనిల్ రావిపూడి రైటింగ్ టీమ్ అందరికీ అభినందనలు.ఈరోజు చాలా ఆనందంగా ఉంది.ఒక వీడియో చూశాను. మమ్మల్ని ఆనందింప చేయడం కోసం మీరు ఇంకా కష్టపడుతున్నారా అని ఓ మహిళా చెప్పిన లా ఎమోషనల్ గా అనిపించింది. కృతజ్ఞతతో నాకు కళ్ళు చెమర్చాయి. మిమ్మల్ని ఆనందంప చేసే అవకాశం నాకు ఆ భగవంతుడు ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మిమ్మల్ని సంతోషపరిచేందుకు కష్టపడడంలో నేను ఆనందాన్ని అనుభవిస్తున్నాను. నేను పని చేయడానికి శక్తి మీ నుంచి వస్తుంది.ఈ జన్మ ఉన్నంత వరకు మిమ్మల్ని అలరిస్తూనే ఉంటాను. ఇది కొనసాగుతూనే ఉంటుంది. జైహింద్.
విక్టరీ వెంకటేష్ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం.సంక్రాంతికి వచ్చి చిరంజీవి గారు ధనాధన్ చేశారు.అద్భుతమైన విజయాన్ని ఇచ్చిన తెలుగు ప్రేక్షకులందరికీ థాంక్యూ. మీ అందరి ఆదరణతో ఈ సినిమా తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో బిగ్గెస్ట్ హిట్ అయింది. అన్ని ఆల్‌టైమ్ రికార్డ్స్‌కి చిరంజీవి అర్హులు.ఇంత అద్భుతమైన సినిమాలో ని భాగమవడం చాలా ఆనందంగా ఉంది. డైరెక్టర్ అనిల్ కి థాంక్యూ. ఆయన టీమ్ అందరికీ కంగ్రాచ్యులేషన్స్. ఈ సినిమాకి పని చేసినమిగతా టెక్నీషియన్స్ అందరికీ కంగ్రాజులేషన్స్. మంచి సూపర్ డూపర్ హిట్ ఇచ్చిన సుస్మిత, షాహుకి కంగ్రాజులేషన్స్. ఇలాంటి విజయాలు మరెన్నో రావాలని కోరుకుంటున్నాను. మీడియా మిత్రులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. వాళ్ళు ఎప్పుడు కూడా మంచి కమర్షియల్ ఎంటర్ టైనర్స్ ని ప్రోత్సహిస్తారు. ఈసారి కూడా ఎంకరేజ్ చేసినందుకు చాలా థాంక్స్. ఇక్కడికి విచ్చేసిన డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిక్యూటివ్స్ అందరికీ అభినందనలు. ఎప్పుడు సంక్రాంతికి వస్తూనే ఉంటాం ధనాధన్ ఇస్తూనే వుంటాం. అందరికీ థాంక్యు.
డైరెక్టర్ కె రాఘవేంద్రరావు మాట్లాడుతూ..ఈ వేడుకకు విచ్చేసిన అందరికీ నమస్కారం.ఈ విజయం సుస్మిత సాహు పై బాధ్యతని మరింత పెంచింది. చిరంజీవి, అల్లు రామలింగయ్య మేము అందరం చిన్నప్పటి నుంచి ఒక కుటుంబం లాగా పెరిగాము.స్వర్గీయ ఎన్టీ రామారావు తో 12 సినిమాలు చేస్తే చిరంజీవితో 14 సినిమాలు చేశాను.చిరంజీవి గారితో అనిల్ తో సినిమా చేస్తే బాగుంటుందని ఒక విత్తనాన్ని నాటాను.అది ఆ సినిమా ఈరోజు మహావృక్షంగా మారింది.ఈ సినిమాలో వెంకటేష్ కూడా చివర్లో జాయిన్ అవ్వడం దుమ్ము దులిపేసింది.ఇద్దరు కలిసి పోటీపడి చేశారు.చిరంజీవికి వయస్సు లేదు .చిరంజీవి గారి రహస్యం ఏమిటి అని అందరూ నన్ను అడుగుతుంటారు. ఇంద్ర సినిమాలో వీణ స్టెప్ చూసి చిరంజీవి లాగా డాన్స్ చేసే హీరో మళ్ళీ పట్టడని ఆయనకి ఆరోజు కాల్ చేసి చెప్పాను. 30 ఏళ్ల క్రితం ఎలా డాన్స్ చేశారో ఇప్పటికి కూడా అదే గ్రేస్ తో చేశారు.సంక్రాంతి సమయానికి ఇండస్ట్రీ చాలా డల్ గా ఉంది.చిరంజీవి సంజీవని తీసుకొచ్చి మొత్తం ఇండస్ట్రీని బతికించారు.అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్.
డైరెక్టర్ అనిల్ రావిపూడి మాట్లాడుతూ..అందరికి నమస్కారం.మరో అదిరిపోయే సంక్రాంతి, ఇరగదీసే సంక్రాంతి ఇచ్చిన ఆడియన్స్ కి థాంక్యూ. లాస్ట్ ఇయర్ విక్టరీ వెంకటేష్ తో సంక్రాంతికి వస్తున్నాం లాంటి విజయాన్ని ఇచ్చారు.ఇప్పుడు చిరంజీవి గారితో మరో అద్భుతమైన విజయాన్ని ఇచ్చారు. వరుసగా తొమ్మిది విజయాలు అంటే నాకు టెన్షన్ మొదలైంది( నవ్వుతూ) ప్రతి సినిమాకి ఇంత పెద్ద విజయాన్ని అందించిన ప్రేక్షకులందరికీ కృతజ్ఞతలు. ఈ సినిమా జర్నీలో నాకు ఎంతో సపోర్ట్ చేసిన మా నిర్మాతలు సుస్మిత,సాహుకి థాంక్యూ.ఈ సినిమాకి పనిచేసిన అందరికీ పేరుపేరునా థాంక్స్.ఈ సినిమా జరుగుతున్న సమయంలో నేను మీకు మంచి హిట్ ఇస్తే నాకు ఏమి ఇస్తారు అని సరదాగా చిరంజీవి గారిని అడుగుతుండేవాడిని. ఈరోజు ఇంటికి పిలిచి నేను ఊహించని గిఫ్ట్ ఇచ్చారు. ఆయన ఒక రేంజ్ లో గిఫ్ట్ ఇస్తారు అనుకున్నాను కానీ రేంజ్ రోవర్ రే గిఫ్ట్ గా ఇచ్చేశారు. ఇది గిఫ్ట్ గా కంటే నా మీద ఆయనకున్న ప్రేమగా చూస్తున్నాను. ఆ ప్రేమని వెలకట్టలేను. మా వెంకటేష్ గారికి స్పెషల్ స్పెషల్ థాంక్స్. ఆయనకి నా మీద ఉన్న ప్రేమ చిరంజీవి గారి మీద ఉన్న గౌరవం మాటల్లో చెప్పలేనిది.ఈ సినిమాకి సంబంధించిన ప్రతి ఈవెంట్లో ఆయన మాతోపాటు ఉన్నారు. ఈ సక్సెస్ ని మా కంటే ఆయన ఎక్కువ ఎంజాయ్ చేస్తున్నారు. ఈ సినిమాకి ఒక స్టేట్మెంట్ ఇవ్వాలనిపించింది. ఇది మెగా ఉత్సవం, విక్టరీ విన్యాసం, రికార్డుల విధ్వంసం, డిస్ట్రిబ్యూటర్ల మహదానందం, ప్రొడ్యూసర్ల మనోధైర్యం ధనాధన్(నవ్వుతూ) చిరంజీవి కోసం రికార్డులన్నీ మమ్మల్ని దత్తత తీసుకోండి సార్ అంటున్నాయి.గిన్నిస్ బుక్ ఆ హుక్ స్టెప్పు పంపుతారా అని అడుగుతోంది సినిమాలో ఉన్న చాలా విషయాలు ఆయనకి సరిగ్గా సరిపోతాయి. గుంటూరు నుంచి వైజాగ్ వరకు ఒక జర్నీ చేశాను. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు ఈ సినిమాని అద్భుతంగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఒక జాతర లాగా చూశారు. చిరంజీవిని అభిమాని అభిమానించే ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు.చిరంజీవితో ఈ సినిమా జర్నీ నాకు ఎన్నో అద్భుతమైన ఎమోషన్స్ ని ఇచ్చింది. ఈ ఆనందాన్ని మళ్లీ పొందడానికి ఆయనతో మరో సినిమా చేయాలనిపిస్తుంది.ఈ సినిమాలో అందరికీ ఆయన ఓటీపీ ఇచ్చారు. ప్రేక్షకులు ఏటీపీ (ఆల్ టైం ప్రభంజనం) ఇచ్చారు.సంక్రాంతి బరిలో ఇది మామూలు మోత మోగలేదు. ఇలాంటి ఎన్నో ఆల్ టైం ప్రభంజనాలు ఆయన మరిన్ని అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.ఈ చిరు జర్నీని ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటాను. ఇది మళ్ళీ మళ్ళీ జరగాలని కోరుకుంటున్నాను.
మ్యూజిక్ డైరెక్టర్ బీన్స్ మాట్లాడుతూ..అందరికీ నమస్కారం. చాలా దూరం ప్రయాణం చేసాం. చేరాల్సిన చోటికి చేరాం. నేను ఇక్కడికి రావడానికి మొదటి కారణం పాట. మనస్ఫూర్తిగా పాటకి థాంక్స్ చిరంజీవి, వెంకటేష్ పక్కన మాట్లాడే గొప్ప అవకాశం వచ్చినందుకు ఈ ప్రయాణంలో నాతోపాటు భాగమైన ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు. నన్ను ఇక్కడ ఉండాలని కోరుకున్న ప్రతి ఒక్కరికి నన్ను ఇక్కడ నిలబెట్టిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. జైహింద్.
నిర్మాత సాహు గారపాటి మాట్లాడుతూ.. అందరికి నమస్కారం.నాకు ఈ అవకాశం ఇచ్చిన చిరంజీవికి, మా సినిమాలో నటించిన వెంకటేష్, డైరెక్టర్ అనిల్ కి థాంక్యూ సో మచ్. నటీనటులు టెక్నికల్ టీమ్ మాకు ఎంతో సపోర్ట్ చేశారు.ఈ సినిమాకు ఇంత అద్భుతమైన సక్సెస్ ఇచ్చిన ప్రేక్షకులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు.మా జర్నీలో భాగమైన డిస్ట్రిబ్యూటర్స్ ఎగ్జిబిటర్స్ అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు.
నిర్మాత సుస్మిత కొణిదెల మాట్లాడుతూ..అందరికి నమస్కారం.వినయ్,రాఘవేంద్రరావు గారికి ధన్యవాదాలు. మా వేడుకలు భాగమైనందుకు చాలా ఆనందంగా ఉంది.ఈ సంక్రాంతిని 15 రోజులు పండగ చేసిన ప్రతి ఒక్క డిస్ట్రిబ్యూటర్ కి ఎగ్జిబిటర్ కి మా హృదయపూర్వక కృతజ్ఞతలు.మన శంకర వరప్రసాద్ గారిని మీ శంకర వరప్రసాద్ చేసుకున్న ప్రతి అభిమానికి, ప్రేక్షకులకు థాంక్యూ సో మచ్.
డైరెక్టర్ వివి వినాయక్ మాట్లాడుతూ..ఈ సినిమా క్రెడిట్ మొత్తం డైరెక్టర్ అనిల్ కి చెందుతుంది. చిరంజీవికి కథ రాయడం మామూలు విషయం కాదు.25 రోజుల్లో కథ రాసి అందులోనూ వెంకటేష్ ని పెట్టి అద్భుతంగా సినిమాను తీశాడు. సినిమా చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది.అనిల్ కి హ్యాట్సాఫ్ చెప్పాలి.చిరంజీవి సంపాదించిన క్రేజ్ గౌరవం అద్భుతం. ఆయనతో రెండు సినిమాలు తీయడం నాకు ఎంతో ఆనందం. నాకు ఎంతో గుర్తింపు తెచ్చిన సినిమాలవి. చిరంజీవితో సినిమా తీయడంలో ఉన్న కిక్కు వేరు. మా అందరికీ అవకాశాలు ఇచ్చిన చిరంజీవికి హృదయపూర్వక కృతజ్ఞతలు.ఇందులో వెంకీ కాంబినేషన్ అద్భుతంగా ఉంది. సినిమాని ప్రేక్షకులు విపరీతంగా చూస్తున్నారు.ఈ సినిమాలో పనిచేసిన ప్రతి ఒక్కరికి కంగ్రాజులేషన్స్.
నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ..మెగా అభిమానులకు, వెంకటేష్ అభిమానులకు నమస్కారం.చిరంజీవి,వెంకటేష్ కి సినిమా టీమ్ అందరికీ కంగ్రాజులేషన్స్.చిరంజీవి ని ఎలా చూపిస్తే అభిమానులు తెలుగు సినిమా ప్రేక్షకులు ఉర్రూతలూగుతారో అంత అద్భుతంగా చూపించి సంక్రాంతి తెలుగు సినిమా ఇండస్ట్రీకి బిగ్గెస్ట్ హిట్ ఇచ్చిన డైరెక్టర్ అనిల్ కి కంగ్రాట్యులేషన్స్. అందరికీ థాంక్యు.
ప్రొడ్యూసర్ సుప్రియ మాట్లాడుతూ..తెలుగు సినిమా కలెక్షన్స్ పవర్ మళ్లీ మాకు చూపించిన చిరంజీవికి ధన్యవాదాలు. సంక్రాంతి గుడ్ లక్ చార్మ్ అనిల్ కి థాంక్యూ. ఒక మంచి సినిమాకు వచ్చే రివార్డ్స్ ప్రొడ్యూసర్ చేతిలో పెట్టడం అంటే దానికంటే సాటిస్ఫాక్షన్ మరొకటి ఉండదు. ఈ అవకాశం ఇచ్చిన సాహుకి సుస్మిత గారికి డిస్ట్రిబ్యూటర్స్ అందరు తరఫున థాంక్యు. మా ఎగ్జిక్యూటివ్స్ అందరూ మాకు చాలా సపోర్ట్ చేశారు. అందరికీ ఆల్ ద బెస్ట్.
లిరిక్ రైటర్ కాసర్ల శ్యామ్ మాట్లాడుతూ..ఆల్ టైం ఇండస్ట్రీ రికార్డ్స్ లో నన్ను కూడా భాగస్వామ్యం చేసినందుకు మెగాస్టార్ చిరంజీవికి హృదయపూర్వక ధన్యవాదాలు. థియేటర్స్ దారి మర్చిపోయిన ఫ్యామిలీ ఆడియన్స్ కి దారి చూపించిన చిరంజీవి గారికి ధన్యవాదాలు. అమెరికా నుంచి అమలాపురం వరకు ప్రతి కుటుంబాలు ఈ సినిమాను థియేటర్స్ లో ఎంజాయ్ చేస్తున్నారు.ఈ సంక్రాంతి మనది అని నిరూపించిన ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు.
ఆర్ డైరెక్టర్ ప్రకాష్ మాట్లాడుతూ..ఈ అద్భుత విజయంలో నేను భాగస్వామి అయినందుకు ఎంతో ఆనందంగా ఉంది.మెగాస్టార్ చిరంజీవికి ధన్యవాదాలు. చిరంజీవి గారి ప్రోత్సహన్ని మర్చిపోలేం.అనిల్ విజయాల్లో మమ్మల్ని కూడా భాగస్వామ్యం చేస్తున్నందుకు ఆయనకి హృదయపూర్వక కృతజ్ఞతలు. నాతో పని చేసిన టెక్నీషియన్స్ కి ఆర్టిస్ట్ అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు
లిరిల్ రైటర్ అనంత శ్రీరామ్ మాట్లాడుతూ..చిరంజీవి ఆశీస్సులతో మనందరం కూడా ఈ విజయోత్సవాన్ని పంచుకోవడం ఎంతో ఆనందంగా ఉంది.ఈ సినిమా విజయానికి చిరంజీవి గారు దర్శకుడు అనిల్ రావిపూడి ప్రధాన కారణం.నా జీవితంలో ప్రతి దశలో చిరంజీవి గారు ప్రత్యక్షంగా పరోక్షంగా ఉన్నారు. ఇంత గొప్ప విజయంలో కూడా భాగం అయినందుకు చాలా ఆనందంగా వుంది.
లిరిక్ రైటర్ భాస్కర్ భట్ల మాట్లాడుతూ..నేను ఇండస్ట్రీకి వచ్చి పాతికేళ్లు అవుతుంది. చిరంజీవి గారితో ఒక బ్లాక్ బాస్టర్ సినిమాకి పనిచేయాలని నా కోరిక. ఆ కోరిక ఈ సినిమాతో తీరింది. నాకు ఈ అవకాశం ఇచ్చిన డైరెక్టర్ అనిల్ రావిపూడి కి ధన్యవాదాలు. మీసాల పిల్ల పాట ప్రపంచవ్యాప్తంగా వైరల్ హిట్ కావడం ఎంతో ఆనందం ఇచ్చింది. లాస్ట్ ఇయర్ వెంకటేష్ గారికి గోదారి గట్టు పాట రాశాను ఈసారి వాళ్ళిద్దరూ కలిసి నటించడం సినిమాల్లో ఈ అద్భుతమైన పాట రాయడం నాకు ఎంతో ఆనందం ఇచ్చింది. అందరికీ శుభాకాంక్షలు. ఘనంగా జరిగిన ఈ వేడుకలో యూనిట్ సభ్యులందరు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- రేపు ఢిల్లీలో కాంగ్రెస్ PCCల భేటీ
- పద్మ అవార్డు గ్రహీతలకు ప్రధాని మోదీ అభినందనలు
- డాక్టర్ నోరి దత్తత్రేయుడికి క్యాన్సర్ చికిత్సలో విప్లవాత్మక సేవలకు పద్మభూషణ్
- నోరి దత్తత్రేయుడికి పద్మభూషణ్ ప్రకటించడం పై NATS హర్షం
- సౌదీ అరేబియాలో వైభవంగా ‘తెలుగింటి సంక్రాంతి’ సంబరాలు
- పద్మ అవార్డులు అందుకున్న సినీ ప్రముఖులు వీళ్ళే..
- అభిమానికి గోల్డ్ చెయిన్ గిఫ్ట్గా ఇచ్చిన తలైవా
- పరీక్షల ఒత్తిడి: యూఏఈ విద్యార్థులు–తల్లిదండ్రులు పాటించాల్సిన జాగ్రత్తలు
- నాంపల్లి అగ్నిప్రమాదం: మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు
- యూఏఈ ఇన్ఫ్లుయెన్సర్లకు బిగ్ అలర్ట్







