ఒమన్ లో పెరిగి చలిగాలుల తీవ్రత..!!
- January 27, 2026
మస్కట్: ఒమన్ సుల్తానేట్ అంతటా తీవ్రమైన చలిగాలులు వీస్తున్నాయి. ముఖ్యంగా పర్వత ప్రాంతాలలో ఉష్ణోగ్రతలు తక్కువ నమోదవుతున్నాయి. జబల్ షామ్స్లో ఎముకలు కొరికేంత చలి -4.0°C నమోదైందని పౌర విమానయాన అథారిటీ (CAA) తెలిపింది. చలి తీవ్రత పెరగడంతో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు. సైక్లో కనిష్టంగా 6.2 డిగ్రీలు, ముక్షిన్ 12.1, హైమా 12.4, ఇబ్రా మరియు ఖైరూన్ హైరిట్టి 13 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
బిడియా, యాలోని, ధంక్ మరియు అల్ ఖాబిల్తో సహా ఇతర ప్రాంతాలలో 13.4 మరియు 13.5 మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉత్తరాదిలో చలిగాలులు తీవ్రత కారణంగా అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని అథారిటీ తెలిపింది. కొన్ని ప్రాంతాలలో తెల్లవారుజామున పొగమంచు కారణంగా విజిబిలిటీ తగ్గడం వల్ల వాహనదారులు జాగ్రత్తగా ఉండాలని అథారిటీ సూచించింది.
తాజా వార్తలు
- అమెజాన్: 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్
- భారత్-ఈయూ వాణిజ్య ఒప్పందం
- అమెరికాలో మంచు తుఫాన్.. 29 మంది మృతి
- ఖతార్ లో ఆకట్టుకున్న ఫుడ్ ఫెస్టివల్ 2026..!!
- సౌదీ స్పెషల్ టాలెంట్ ప్రీమియం రెసిడెన్సీ..3,484 సంస్థలకు ఆమోదం..!!
- ఒమన్ లో పెరిగి చలిగాలుల తీవ్రత..!!
- కువైట్ లో భద్రత బలోపేతం..BMW పెట్రోల్ వాహనాలు..!!
- గల్ఫ్ఫుడ్ 2026ను సందర్శించిన షేక్ మొహమ్మద్..!!
- బహ్రెయిన్ ఓపెన్ టెన్నిస్ ఛాలెంజర్ ప్రారంభం..!!
- చిరు వ్యాపారులకు కేంద్ర ప్రభుత్వ శుభవార్త







