భారత రూపాయి పతనానికి బ్రేక్ పడుతుందా?

- January 27, 2026 , by Maagulf
భారత రూపాయి పతనానికి బ్రేక్ పడుతుందా?

యూఏఈ: మంగళవారం భారత రూపాయి అమెరికా డాలర్‌తో పోలిస్తే 91.82 వద్ద ప్రారంభమైంది. యూఏఈ దిర్హామ్‌తో పోలిస్తే 25.01907 వద్ద ట్రేడ్ అవుతోంది. ఇది చారిత్రాత్మక కనిష్ట స్థాయి నుండి 8 పైసలు కోలుకుంది. గత వారం రూపాయి 1.18 శాతం పడిపోయి, మొదటిసారిగా డాలర్‌కు 92.00 స్థాయికి సమీపంలోకి వచ్చింది.   

వ్యాపారుల ప్రకారం, రుపాయి పతనాన్ని నిలువరించడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జోక్యం చేసుకుంటున్నా.. రూపాయి పతనం ఆగడం లేదు. అయితే, ఆర్బీఐ ఏదో ఒక నిర్దిష్ట స్థాయిని కాపాడటానికి ప్రయత్నించకుండా.. వివిధ స్థాయిలలో డాలర్లను సరఫరా చేస్తోందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.

 రూపాయి పతనం వేగాన్ని బట్టి చూస్తే, ఒత్తిళ్లు కేవలం పోర్ట్‌ఫోలియో లకే పరిమితం కాలేదని, ముఖ్యంగా బులియన్ దిగుమతులు పెరిగినట్లు కనిపిస్తోందని వ్యాపారులు చెబుతున్నారు. రాబోయే రోజుల్లోనూ రూపాయి బలహీనంగా కదులుతుందని, డాలర్ ,  యూఏఈ దిర్హామ్‌తో రూపాయి విలువ మరింత తగ్గే అవకాశాలు ఉన్నాయని అంచనా వేస్తున్నట్టు మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com