ఇండియా-సౌదీ అరేబియా భాగస్వామ్యం బలోపేతం..!!

- January 27, 2026 , by Maagulf
ఇండియా-సౌదీ అరేబియా భాగస్వామ్యం బలోపేతం..!!

యూఏఈ: భారతదేశ 77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా, సౌదీ అరేబియాలో నివసిస్తున్న భారతీయులందరికీ సౌదీ అరేబియాలోని భారత రాయబారి ఫహద్ అహ్మద్ ఖాన్ సూరి శుభాకాంక్షలు తెలియజేశారు. భారత్ -సౌదీ అరేబియా వ్యూహాత్మక భాగస్వామ్యం మరింతగా పెరుగుతూనే ఉందని పేర్కొన్నారు. ఏప్రిల్ 2025లో భారత ప్రధాని నరేంద్ర మోదీ జెడ్డా పర్యటన, ఇది ద్వైపాక్షిక సంబంధాలను మరింతగా పెంచిందని తెలిపారు.  ప్రాంతీయ స్థాయిలో జెడ్డాలోని భారత కాన్సులేట్ జనరల్ ఈ భాగస్వామ్యాన్ని స్పష్టమైన ఫలితాలుగా అనువదించడానికి చురుకుగా పనిచేస్తుందని తెలిపారు.

జెడ్డా నగరంలో భారత నావికాదళ నౌకలు INS సూరత్ మరియు INS తమల్‌ లు స్నేహం, సహకారం మరియు మన రెండు దేశాల మధ్య పెరుగుతున్న నమ్మకాన్ని సూచిస్తున్నాయని తెలిపారు. సాంస్కృతిక డిప్లోమసీ ప్రజల మధ్య సంబంధాలను పెంపొందిస్తుందని తెలిపారు. రెడ్ సీ ఫిల్మ్ ఫెస్టివల్‌లో భారత్ పాల్గొనడం, వివిధ ప్రావిన్సులలో ఇండియా ఫెస్టివల్ వేడుకలు, మరియు నూర్-ఎ-దీపావళి మరియు ఆర్గానిక్ ఇఫ్తార్ వంటి కమ్యూనిటీ నేతృత్వంలోని సాంస్కృతిక కార్యక్రమాలు లోతైన సాంస్కృతిక సంబంధాల బలోపేతానికి దోహదపడ్డాయని వివరించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com