ఖర్జూరం హల్వా
- July 20, 2015
ఖర్జూరం హల్వా
కావలిసినవి
ఖర్జూరాలు - రెండు కప్పులు
పాలు - రెండు కప్పులు
పంచదార - ఒకటిన్నర కప్పు
యాలకుల పొడి - ఒక స్పూను
జీడిపప్పులు - సరిపడా
నెయ్యి - రెండు టీస్పూన్లు
తయారీ విధానం
ముందుగా ఖర్జూరాలు గింజలు తీసి, పాలల్లో ఐదారు గంటలు నానబెట్టాలి. తర్వాత ఈ ఖర్జూరాలని మిక్సీలో వేసి మెత్తగా రుబ్బాలి. ఈ మిశ్రమంలో పంచదార కలిపి బాణలిలో నెయ్యి వేసి చిన్న మంట మీద కాసేపు ఉడికించాలి. మధ్య మధ్యలో నెయ్యి వేసి ఉండలు కట్టకుండా కలుపుకోవాలి. దానిలో యాలకులపొడి, జీడిపప్పు ముక్కలు వేసి దగ్గరగా అయ్యే వరకూ మంచి వాసన వచ్చేవరకూ బాగా వేయిస్తూ కలుపుతూ స్టవ్ ఆఫ్ చేసేసి, నెయ్యి రాసిన ఒక ప్లేట్‌లోకి ఈ మిశ్రమాన్ని తీసుకుని చల్లారే వరకూ ఆరనిచ్చి, ముక్కలుగా కోసుకోవాలి. అంతే నోరూరించే ఖర్జూరం హల్వా రెఢీ.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్‌తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్‌పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









