ఏపీ క్యాబినెట్ కీలక నిర్ణయాలు ఇవే..

- January 28, 2026 , by Maagulf
ఏపీ క్యాబినెట్ కీలక నిర్ణయాలు ఇవే..

అమరావతి:  ఏపీ క్యాబినెట్ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పలు అంశాలకు మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది. క్యాబినెట్ నిర్ణయాలను మంత్రి పార్ధసారథి మీడియాకు వివరించారు. 35 అజెండా అంశాలకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది. టీటీడీ కల్తీ నెయ్యి కేసులో సిట్ ఇచ్చిన నివేదికపై మంత్రివర్గంలో చర్చించారు. సిట్ నివేదికపై వైసీపీ దుష్ప్రచారం చేస్తోందని మంత్రులు చెప్పారు. కల్తీ నెయ్యి కేసులో సిట్ నివేదికను తెప్పించాలని క్యాబినెట్ కోరింది. సిట్ నివేదిక స్టడీ చేసి స్పందించాలని మంత్రులకు సూచించారు సీఎం చంద్రబాబు.

  • ద్వారకా తిరుమలలో సాయిబాబా ఆలయ నిర్మాణానికి 2 ఎకరాల ప్రభుత్వ భూమి కేటాయింపు
  • కృష్ణపట్నం పోర్ట్ కు అటవీ భూమి మళ్లింపునకు బదులుగా 216 ఎకరాల ప్రభుత్వ భూమి అటవీ శాఖకు బదిలీ
  • పలమనేరు వద్ద ఉన్న ఎస్ వీవీయూ భూమి 33 ఎకరాలు వ్యవసాయ మార్కెట్ కమిటీకి బదిలీ
  • పీపీపీ విధానంలో పిడుగురాళ్ల ప్రభుత్వ మెడికల్ కాలేజీ అభివృద్ధి
  • తిరుపతి, విశాఖ శిల్పారామం ప్రాజెక్టులకు కొత్తగా EOIల ఆహ్వానం
  • ఒలంపియన్ కుమారి జ్యోతికి ప్రోత్సాహకాలు
  • అర్జున్ అవార్డ్ గ్రహీత జ్యోతికి విశాఖలో 500 చదరపు గజాల స్థలం, గ్రూప్-1 ఉద్యోగం
  • పీపీపీ విధానంలో గుంటూరు శిల్పారామంలో సాంస్కృతిక కేంద్రం
  • అభ్యంతరకరమైన రోడ్-హిట్ ప్లాట్లను రద్దు చేసి ప్రత్యామ్నాయ కేటాయింపులకు ఏపీసీఆర్డీఏకి అధికారం ఇవ్వడం
  • ఎస్వీయూ పరిధిలోని 33 ఎకరాల భూమి వ్యవసాయ మార్కెట్ కమిటీకి బదిలీ
  • టీటీడీ పరిధిలో పలు పోస్టుల అప్ గ్రేడ్ కు మంత్రివర్గం ఆమోదం
  • పలు సంస్థలకు భూ కేటాయింపులకు క్యాబినెట్ ఆమోదం
  • ఇంధనశాఖలో పలు పాలనా అనుమతులకు ఆమోదం
Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com