షార్జా బిల్డింగ్‌లో బాంబు బూచి
- July 29, 2016
అల్ ఖాసిమి రెసిడెంట్స్ బాంబు భయంతో విలవిల్లాడారు. మస్రెక్ బిల్డింగ్‌లో బాంబు ఉందంటూ వార్తలు రావడమే దీనికి కారణం. ఈ వార్తలతో పోలీసులు అప్రమత్తమయ్యారు. బిల్డింగ్‌ని, పరిసరాల్లోని ప్రజల్ని అప్పటికప్పుడు కాళీ చేయించి, తనిఖీలు నిర్వహించారు. ఎక్స్‌ప్లోజియన్, పెట్రోల్స్, సిఐడి, అంబులెన్స్, సివిల్ డిఫెన్స్, ఫైర్ ఫైటర్స్ తదితర విభాగాలన్నీ హుటాహుటిన అక్కడికి చేరుకున్నాయి. తనిఖీల అనంతరం అది ఉత్తుత్తి బెదిరింపు ప్రచారమని తేల్చారు. తాను భోజనం చేస్తుండగా పోలీస్ సైరన్, బాంబు హెచ్చరికలు విన్నాననీ, వెంటనే ఇంట్లోంచి బయటకు వచ్చేశానని జాక్ లుమీర్ అనే రెసిడెంట్ చెప్పారు. బాంబు భయంతో విలవిల్లాడామనీ, అదంతా ఉత్తదేనని తేలాక ఊపిరి పీల్చుకున్నామని పలువురు రెసిడెంట్స్ పరిస్థితిని వివరించారు.
తాజా వార్తలు
- గ్రీన్ ల్యాండ్ లో అమెరికా యుద్ధ విమానాలు
- DIMDEX 2026 ను ప్రారంభించిన అమీర్..!!
- పవిత్ర రమదాన్ మాసం ఫిబ్రవరి 19న ప్రారంభం..!!
- బహ్రెయిన్ లో లగ్జరీ వాచీల స్కామ్..ఇద్దరికి జైలుశిక్ష, ఫైన్..!!
- కొత్త అల్-జౌఫ్ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం..!!
- కువైట్‌లో ఇండియా AI ఇంపాక్ట్ సమ్మిట్ 2026 సన్నాహక సమావేశం..!!
- భారత్, యూఏఈ మధ్య కుదిరిన కీలక ఒప్పందాలు..!!
- యూఏఈ అధ్యక్షుడికి అదిరిపోయే గిఫ్టులు ఇచ్చిన భారత ప్రధాని..!!
- ఉచితంగా చంద్రుడి పైకి ప్రయాణం చేసే అవకాశం
- ఇక OTPలు అవసరం లేదా?







