24 మంది ప్రాణాలు తీసిన ఐఎస్‌

- July 29, 2016 , by Maagulf
24 మంది ప్రాణాలు తీసిన ఐఎస్‌

ఇస్లామిక్‌ స్టేట్‌ (ఐఎస్‌) ఉగ్రవాద సంస్థ సిరియాలోని ఓ గ్రామాన్ని ఆధీనంలోకి తీసుకున్న తర్వాత అక్కడి 24 మంది పౌరులను దారుణంగా చంపేసింది. ఐఎస్‌ గత 24 గంటల్లో సిరియా ఉత్తరప్రాంతంలోని బుయిర్‌ గ్రామంలో 24 మంది ప్రాణాలు తీసిందని అమెరికా మద్దతుతో నడుస్తున్న కుర్దిష్‌-అరబ్‌ అలియాన్స్‌ అనే పర్యవేక్షణ సంస్థ వెల్లడించింది. టర్కీ సరిహద్దులో మాన్‌బిజ్‌ పట్టణానికి పది కి.మీ.ల దూరంలో ఉన్న ఈ బుయిర్‌ గ్రామాన్ని ఉగ్రవాదులు ఆధీనంలోకి తీసుకున్నారు. దీంతో పాటు మాన్‌బిజ్‌ పరిసరాల్లోని చాలా గ్రామాలు ఉగ్రవాదులు తమ చేతుల్లోకి తీసుకున్నారు. సిరియా, ఇరాక్‌లలో ఇస్లామిక్‌ స్టేట్‌ ఉగ్రవాదులు తీవ్ర అరాచకాలకు పాల్పడుత్ను సంగతి తెలిసిందే. ఆత్మాహుతి దాడులతో పాటు పౌరులపై దాడులు చేసి కిరాతకంగా చంపేస్తున్నారు.వైమానిక దాడుల్లో మరో 28 మంది మృతి సిరియా ఉత్తర ప్రాంతంలో ఉగ్రవాదులు ఆధీనంలోకి తీసుకున్న గ్రామంపై ఉగ్రవాదులు లక్ష్యంగా అమెరికా ఆధ్వర్యంలో వైమానిక దాడులు జరిగాయి. ఈ దాడుల్లో కూడా సుమారు 28 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయినట్లు బ్రిటన్‌కు చెందిన మానవ హక్కుల పర్యవేక్షణ సంస్థ వెల్లడించింది. అల్‌-ఘండోర్‌ గ్రామంలో గత రాత్రి ఈ వైమానిక దాడులు జరిగినట్లు పేర్కొంది. ఈ గ్రామం కూడా మాన్‌బిజ్‌ పట్టణ సమీపంలోనే ఉంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com