ఖతార్, భారత్ మధ్య పెట్టుబడి అవకాశాలపై చర్చలు..!!
- January 29, 2026
దోహా: పెట్టుబడి అవకాశాలపై ఖతార్ చాంబర్, ఇండియా నుండి వచ్చిన వ్యాపార ప్రతినిధి బృందం చర్చలు జరిపింది. రెండు దేశాల మధ్య వాణిజ్య మరియు ఆర్థిక సంబంధాలు.. వాటిని పెంచే మార్గాలపై చర్చలు జరిపారు. ఖతార్ తరపున ఖతార్ చాంబర్ సెకండ్ వైస్-చైర్మన్ రషీద్ బిన్ హమద్ అల్ అత్బా నాయకత్వం వహించగా, భారత ప్రతినిధి బృందానికి PHDCCIలో హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్ కమిటీ కో-చైర్మన్ అనుజ్ ఖన్నా నాయకత్వం వహించారు.
ఖతార్ మరియు భారత్ మధ్య ఉన్న వాణిజ్య మరియు ఆర్థిక రంగాలలో బలమైన సంబంధాలను ప్రశంసించారు. ఖతార్ కీలక వాణిజ్య భాగస్వాములలో భారత్ ఒకటి అని, 2024 లో ద్వైపాక్షిక వాణిజ్యం QR 47 బిలియన్లకు చేరుకుందని రషీద్ బిన్ హమద్ అల్ అత్బా పేర్కొన్నారు.
రెండు దేశాలలో వ్యాపార రంగాలకు అందుబాటులో ఉన్న విస్తృత అవకాశాలపై సమీక్షించారు. కొత్త పెట్టుబడి రంగాలను అన్వేషించాలని నిర్ణయించారు. ఖతార్ ఒక ప్రముఖ పెట్టుబడి గమ్యస్థానం మరియు మిడిలీస్టు, ఆఫ్రికా మార్కెట్లకు భారతీయ పెట్టుబడిదారులకు ప్రవేశ ద్వారం అని అనుజ్ ఖన్నా అన్నారు. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు పెట్టాలని ఖన్నా ఖతారీ పెట్టుబడిదారులకు పిలుపునిచ్చారు.
తాజా వార్తలు
- ఈసారి మాములుగా ఉండదంటూ కార్యకర్తల్లో జోష్ నింపిన జగన్
- ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం
- అరబ్-భారత సహకార వేదిక ఉజ్వల భవిష్యత్తుకు వారధి..!!
- ఖతార్, భారత్ మధ్య పెట్టుబడి అవకాశాలపై చర్చలు..!!
- షార్జాలో సినిమా ఫక్కీలో కారు చోరీ.. దొంగ అరెస్ట్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ కెమెరా వ్యవస్థ మొదటి దశ ప్రారంభం..!!
- సౌదీ అరేబియాలో ఫాగ్, రెయిన్స్ హెచ్చరికలు జారీ..!!
- అంతరిక్ష రంగంలో మరిన్ని పెట్టుబడులకు ఒమన్ పిలుపు..!!
- పిల్లల ఇంటర్నెట్ వాడకం పై కఠిన నిబంధనలు..
- తెలంగాణ–ఏపీలో జియో శిక్షణ తరగతులు







