ఫుజైరాలో భారతీయ ప్రవాసుడు అనుమానస్పద మృతి..!!
- January 29, 2026
యూఏఈ: ఫుజైరాలో ఒక యువ భారతీయ ప్రవాసుడు తన ట్రైలర్‌లో నిద్రపోతున్నప్పుడు అనుమానస్పదంగా మరణించిన ఘటన చోటుచేసుకుంది. 29 ఏళ్ల అన్సార్ మృతదేహం అతను పనిచేస్తున్న ట్రైలర్ ట్రక్కులో లభించిందని, అతని మరణానికి కారణం ఇంకా తెలియరాలేదని పోలీసులు తెలిపారు. అతని మరణానికి కచ్చితమైన కారణం తెలుసుకోవడానికి ఫోరెన్సిక్ నివేదిక కోసం ఎదురుచూస్తున్నామని అన్నారు.
అన్సార్ కేరళకు చెందినవాడు. ఎనిమిది సంవత్సరాల క్రితం యూఏఈకి వచ్చాడు. అప్పటి నుండి అతను తన స్వస్థలాన్ని సందర్శించలేదని, అతను వచ్చే నెలలో భారత్ కు వెళ్లాలని ప్లాన్ చేస్తున్నాడని మృతుడి సోదరుడు అనస్ చెప్పాడు. అతను మసాఫీలోని ఒక గ్యారేజీలో పనిచేసేవాడని, యూఏఈ అంతటా ప్రయాణిస్తాడని, గత నెలలో హెవీ ట్రక్ లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకున్నాడని తెలిపాడు.
అన్సార్ మసాఫీలో పనిచేస్తుండగా, అనస్ తన తండ్రి మరియు మామతో కలిసి ముర్బాలో పనిచేస్తున్నాడు. వారు ఆ ప్రాంతంలో ఒక కిరాణా దుకాణాన్ని నడుపుతున్నారు. వారి తండ్రి ఈ నెల ప్రారంభంలో భారత్ కు వెళ్లారు. మరోవైపు, కేరళ ముస్లిం కల్చరల్ సెంటర్ (కేఎంసీసీ) అనే సంస్థ అన్సార్ మృతదేహాన్ని స్వదేశానికి తరలించే ఏర్పాట్లు చేస్తోందని ఒక సామాజిక కార్యకర్త చెప్పారు.
తాజా వార్తలు
- కేవలం 28 నిమిషాల్లోనే హైదరాబాద్ టు వైజాగ్?
- భారత లగ్జరీ టూరిస్ట్ రైళ్లపై ఖతార్ లో రోడ్షో..!!
- సౌదీ అరేబియాలో స్కోడా కార్స్ రీకాల్..!!
- ఫుజైరాలో భారతీయ ప్రవాసుడు అనుమానస్పద మృతి..!!
- కువైట్లో 1.059 మిలియన్లకు పెరిగిన భారతీయ జనాభా..!!
- ఒమన్ లో ఇండియన్ ఎంబసీ గ్రాండ్ రిసెప్షన్ సక్సెస్..!!
- సిత్రాలో ప్రైవేట్ ఆస్తుల స్వాధీనానికి సిఫార్సు..!!
- తన రిటైర్మెంట్ పై క్లారిటీ ఇచ్చిన యువీ
- యాదగిరిగుట్ట ఆలయంలో వెండి, బంగారం డాలర్లు మాయం..
- వింగ్స్ ఇండియా 2026 సందర్భంగా నిర్వహించిన ద్వైపాక్షిక సమావేశాలు







