క్సైజ్ శాఖ డైరీలు, క్యాలెండర్ ఆవిష్కరించిన మంత్రి కొల్లు రవీంద్ర

- January 29, 2026 , by Maagulf
క్సైజ్ శాఖ డైరీలు, క్యాలెండర్ ఆవిష్కరించిన మంత్రి కొల్లు రవీంద్ర

మంగళగిరి: ఆంధ్రప్రదేశ్ ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్, గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర గురువారం ఎక్సైజ్ శాఖకు సంబంధించిన డైరీ, క్యాలెండర్ లను విష్కరించారు.ఈ కార్యక్రమం మంగళగిరిలోని ప్రొహిబిషన్,ఎక్సైజ్ కమిషనర్ కార్యాలయంలో జరిగగా, ఆంధ్రప్రదేశ్ ప్రొహిబిషన్,ఎక్సైజ్ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ అసోసియేషన్ డైరీలు విడుదల చేశారు. కానిస్టేబుల్స్, హెడ్ కానిస్టేబుల్స్ అసోసియేషన్ క్యాలెండర్  కూడా ఆవిష్కరించారు.

మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ ప్రజల ఆరోగ్యం ప్రభుత్వానికి అత్యంత ముఖ్యమని తెలిపారు.నాణ్యమైన మద్యం సరఫరా కోసం ఎక్సైజ్ సురక్ష యాప్ ప్రవేశ పెట్టామని, గత ప్రభుత్వం శాఖను విభజించి నాణ్యతలేని మద్యం సరఫరా చేసిందని విమర్శించారు.ఎక్సైజ్ శాఖలో ఖాళీగా ఉన్న కానిస్టేబుల్ పోస్టులు,పెండింగ్ ప్రమోషన్లను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి త్వరగా పరిష్కరిస్తామని మంత్రి హామీ ఇచ్చారు.

ప్రిన్సిపల్ సెక్రటరీ ముఖేష్ కుమార్ మీనా మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఆదేశాలతో ఆంధ్రప్రదేశ్‌ను దేశంలోనే తొలి నాటు సారా రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దామని తెలిపారు. రాష్ట్రంలో ఎక్సైజ్ అకాడమీ ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. డైరెక్టర్ చామకూరి శ్రీధర్ మాట్లాడుతూ అసోసియేషన్లు ఉద్యోగుల సంక్షేమాన్ని కాపాడాలని సూచించారు. ప్రభుత్వం–ఉద్యోగుల మధ్య వారధిగా నిలవాలన్నారు.

డైరెక్టర్ రాహుల్ దేవ్ శర్మ మాట్లాడుతూ ఇతర రాష్ట్రాల నుంచి అక్రమ మద్యం రాకుండా అడ్డుకోవాలని,ప్రతి ఉద్యోగి బాధ్యతతో పనిచేయాలని సూచించారు.ఈ కార్యక్రమంలో
అడిషనల్ కమిషనర్ ఎం.దేవ కుమార్, బి.నరసింహులు–సెక్రటరీ, గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్, కె.కామేశ్వరరావు–ప్రెసిడెంట్, ఎక్సైజ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ అసోసియేషన్,
మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com