ఫేక్ వర్క్ పర్మిట్లు.. ఎనిమిది మందికి శిక్షలు ఖరారు..!!
- January 30, 2026
మనమా: కల్పిత వాణిజ్య రికార్డుల ద్వారా చట్టవిరుద్ధంగా వర్క పర్మిట్లను పొందిన మూడు వేర్వేరు కేసులలో ఎనిమిది మంది నిందితులను క్రిమినల్ కోర్టులు దోషులుగా నిర్ధారించాయని పబ్లిక్ ప్రాసిక్యూషన్ అధిపతి ప్రకటించారు.
మొదటి కేసులో.. ఐదుగురు నిందితులకు ఒక సంవత్సరం జైలు శిక్ష విధించింది. ఉనికిలో లేని కంపెనీలకు సంబంధించిన 51 వాణిజ్య రికార్డులను ఉపయోగించి 93 వర్క్ పర్మిట్లు పొందినట్లు తేలిన తర్వాత వారిని శాశ్వతంగా బహిష్కరించాలని ఆదేశించింది.
రెండవ కేసులో.. 32 కల్పిత వాణిజ్య రికార్డుల ద్వారా 61 వర్క్ పర్మిట్లను చట్టవిరుద్ధంగా పొందినందుకు ఒక నిందితుడికి 61,000 దినార్ల జరిమానా మరియు శాశ్వతంగా బహిష్కరణ వేటు వేసింది.
మూడవ కేసులో.. కల్పిత కంపెనీల కింద నమోదు చేయబడిన 21 వాణిజ్య రికార్డుల ద్వారా 42 వర్క్ పర్మిట్లను పొందినందుకు కోర్టు మొదటి నిందితుడికి 40,000 దినార్ల జరిమానా మరియు రెండవ నిందితుడికి 2,000 దినార్ల జరిమానాతో పాటు శాశ్వతంగా బహిష్కరించాలని ఆదేశించింది.
తాజా వార్తలు
- భక్తులకు టీటీడీ అలర్ట్: మార్చి 3న ఆలయం మూసివేత
- పీటీ ఉషా భర్త శ్రీనివాసన్ కన్నుమూత
- తాడేపల్లిగూడెంలో కొత్త విమానాశ్రయం ఏర్పాటుకు ప్రభుత్వం ప్రతిపాదన
- డబ్డూబ్ వరల్డ్..2.5 KD ప్లే జోన్ ఆఫర్..!!
- ఫేక్ వర్క్ పర్మిట్లు.. ఎనిమిది మందికి శిక్షలు ఖరారు..!!
- ఒమన్ లో ఆర్కియాలజీపై ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్..!!
- సౌదీ అరేబియా జీడీపీ 4.8% వృద్ధి..!!
- జెబెల్ జైస్ జనవరి 31న రీ ఓపెన్..!!
- మెట్రోలింక్ సేవలను అప్డేట్ చేసిన దోహా మెట్రో..!!
- 'ఫౌజీ' దసరాకి గ్రాండ్ గా రిలీజ్







