పీటీ ఉషా భర్త శ్రీనివాసన్ కన్నుమూత
- January 30, 2026
కేరళ: ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షురాలు, రాజ్యసభ సభ్యురాలు డా. పీటీ ఉషా భర్త వి. శ్రీనివాసన్ (64) శుక్రవారం తెల్లవారుజామున కన్నుమూశారు. కేరళలోని కోజికోడ్ జిల్లా తిక్కోడి పెరుమల్పురంలోని నివాసంలో రాత్రి సుమారు 1 గంట సమయంలో ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. వెంటనే సమీపంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఘటన సమయంలో డా. పీటీ ఉషా ఇంట్లో లేరు. ఆమె పార్లమెంట్ సమావేశాలకు నిమిత్తం ఢిల్లీలో ఉన్నారు. ప్రస్తుతం స్వగ్రామానికి తిరుగు ప్రయాణం అయ్యారు.
శ్రీనివాసన్ సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF)లో ఇన్‌స్పెక్టర్‌గా పనిచేసి పదవీ విరమణ పొందారు. క్రీడాకారుడు కూడా అయిన ఆయన 1991లో పీటీ ఉషను వివాహం చేసుకున్నారు. వీరికి విఘ్నేష్ ఉజ్వల్ కుమారుడు ఉన్నాడు. పీటీ ఉష నడిపే ఉష స్కూల్ ఆఫ్ అథ్లెటిక్స్ అభివృద్ధిలో శ్రీనివాసన్ కీలక పాత్ర పోషించారు. శ్రీనివాసన్ ఆకస్మిక మరణంపై పలువురు క్రీడాకారులు, రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. పీటీ ఉష సాధించిన ప్రతీ విజయానికి ఆయన నిరంతర ప్రోత్సాహం, మద్దతే కీలకమైనదని క్రీడా ప్రపంచం గుర్తు చేసుకుంటోంది.
తాజా వార్తలు
- భక్తులకు టీటీడీ అలర్ట్: మార్చి 3న ఆలయం మూసివేత
- పీటీ ఉషా భర్త శ్రీనివాసన్ కన్నుమూత
- తాడేపల్లిగూడెంలో కొత్త విమానాశ్రయం ఏర్పాటుకు ప్రభుత్వం ప్రతిపాదన
- డబ్డూబ్ వరల్డ్..2.5 KD ప్లే జోన్ ఆఫర్..!!
- ఫేక్ వర్క్ పర్మిట్లు.. ఎనిమిది మందికి శిక్షలు ఖరారు..!!
- ఒమన్ లో ఆర్కియాలజీపై ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్..!!
- సౌదీ అరేబియా జీడీపీ 4.8% వృద్ధి..!!
- జెబెల్ జైస్ జనవరి 31న రీ ఓపెన్..!!
- మెట్రోలింక్ సేవలను అప్డేట్ చేసిన దోహా మెట్రో..!!
- 'ఫౌజీ' దసరాకి గ్రాండ్ గా రిలీజ్







