స్వచ్ఛ్ భారత్ స్ఫూర్తితో సముద్రాల రక్షణకు తెలుగుఈకో వారియర్స్ ఉద్యమం

- January 30, 2026 , by Maagulf
స్వచ్ఛ్ భారత్ స్ఫూర్తితో సముద్రాల రక్షణకు తెలుగుఈకో వారియర్స్ ఉద్యమం

మనామా: స్వచ్ఛ్ భారత్ అభియాన్ స్ఫూర్తితో, తెలుగుఈకో వారియర్స్ ఆధ్వర్యంలో “స్వచ్ఛ్ బహ్రెయిన్–క్లీన్ బహ్రెయిన్” కార్యక్రమాన్ని బహ్రెయిన్‌లోని సీఫ్ బీచ్ వద్ద (భారత రాయబార కార్యాలయం వెనుక భాగంలో) ఘనంగా నిర్వహించారు. సముద్రాల్లో ప్లాస్టిక్ కాలుష్యాన్ని తగ్గించడం, పర్యావరణ పరిరక్షణపై ప్రజల్లో అవగాహన పెంపొందించడమే ఈ కార్యక్రమ ప్రధాన లక్ష్యం.

100 వారాల వేడుకల్లో భాగంగా నిర్వహించిన ఈ కార్యక్రమానికి బహ్రెయిన్ బోర్స్ సీఈఓ షేక్ ఖలీఫా బిన్ ఇబ్రాహీం అల్ ఖలీఫా ముఖ్య అతిథిగా హాజరై కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించారు.
సంపంగి గ్రూప్ చైర్మన్ శ్రీ రమేష్ సంపంగి ప్రత్యేక అతిథిగా పాల్గొన్నారు.
ఈ కార్యక్రమానికి షిఫా అల్ జజీరా సీఈఓ & డైరెక్టర్ శ్రీ హబీబ్ రెహ్మాన్ సహ-ప్రాయోజకులుగా వ్యవహరించగా, OM జ్యువెలరీ WLL ప్రతినిధులు కూడా పాల్గొన్నారు.

ఈ కార్యక్రమాన్నిరామమోహన్ కొతపల్లి,నవీన్ కొటగిరి మరియు తెలుగుఈకో వారియర్స్ సభ్యులు సంయుక్తంగా నిర్వహించారు. బహ్రెయిన్‌ను తమ కార్యస్థలంగా గర్వంగా భావిస్తున్నామని, ఆ దేశ అభివృద్ధి మరియు పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావడం ఆనందంగా ఉందని సభ్యులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు.

కార్యక్రమ నిర్వహణకు సంపూర్ణ సహకారం అందించిన బహ్రెయిన్ ప్రభుత్వానికి నిర్వాహకులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అలాగే బహ్రెయిన్ రాజు హిజ్ మజెస్టీ కింగ్ హమద్ బిన్ ఇసా అల్ ఖలీఫా, క్రౌన్ ప్రిన్స్ హిజ్ రాయల్ హైనెస్ ప్రిన్స్ సల్మాన్ బిన్ హమద్ అల్ ఖలీఫాకి
హృదయపూర్వక శుభాకాంక్షలు మరియు గౌరవాభివందనలు తెలియజేశారు.

పర్యావరణ పరిరక్షణ, ప్రజా అవగాహన పట్ల తమ నిబద్ధతను చాటుకుంటూ, భవిష్యత్తులో కూడా సమాజం మరియు ప్రకృతి మేలు కోసం ఇలాంటి కార్యక్రమాలను నిరంతరం కొనసాగిస్తామని తెలుగుఈకో వారియర్స్ ప్రకటించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com