ఇక పై గూగుల్ మీ ‘గూగ్లీ’ కి సాయం చేస్తుంది: సీఈఓ

- January 30, 2026 , by Maagulf
ఇక పై గూగుల్ మీ ‘గూగ్లీ’ కి సాయం చేస్తుంది: సీఈఓ

టెక్ దిగ్గజం గూగుల్.. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC)తో ఓ చారిత్రాత్మక భాగస్వామ్యాన్ని కుదుర్చుకుంది. గూగుల్‌కు చెందిన అత్యాధునిక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) మోడల్ ‘జెమిని 3 ప్రో’ ఇప్పుడు క్రికెట్ మైదానంలో చోటుచేసుకునే ప్రతి కదలికను విశ్లేషించి అభిమానులకు సరికొత్త అనుభూతిని అందించడానికి సిద్ధమైంది.

ICCతో Google ఒప్పందం పై ఆ సంస్థ CEO సుందర్ పిచాయ్ తనదైన శైలిలో ట్వీట్ చేశారు. క్రికెట్ అంటే ఎంతో ఇష్టపడే గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ ఈ భాగస్వామ్యం పై స్పందిస్తూ తన ‘ఎక్స్’ ఖాతాలో ఓ ఆసక్తికరమైన పోస్ట్ పెట్టారు. “ఇకపై గూగుల్ మీ ‘గూగ్లీ’కి సాయం చేస్తుంది” అంటూ ఆయన క్రికెట్ పరిభాషలో చమత్కరించారు. సంక్లిష్టమైన క్రికెట్ సాంకేతికతను, వ్యూహాలను సామాన్యులకు కూడా సులభంగా అర్థమయ్యేలా చేయడంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కీలక పాత్ర పోషిస్తుందని సుందర్ పిచాయ్ ఈ సందర్భంగా ఆశాభావం వ్యక్తం చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com