దుబాయ్‌లో 200 మంది డెలివరీ రైడర్‌లకు సత్కారం..!!

- January 30, 2026 , by Maagulf
దుబాయ్‌లో 200 మంది డెలివరీ రైడర్‌లకు సత్కారం..!!

యూఏఈ: దుబాయ్‌లోని రెండు వందల మంది డెలివరీ రైడర్‌లను ఎమిరేట్స్ రోడ్స్ అండ్ ట్రాన్స్‌పోర్ట్ అథారిటీ (RTA) సత్కరించింది. దుబాయ్ పోలీస్ ఆఫీసర్స్ క్లబ్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో.. డెలివరీ సెక్టార్ ఎక్సలెన్స్ అవార్డు రెండవ ఎడిషన్ విజేతలను ప్రకటించారు.

డెలివరీ కంపెనీలు, బైక్ రైడర్‌లు ట్రాఫిక్ చట్టాలు మరియు నిబంధనలకు కట్టుబడి ఉండేలా ప్రోత్సహించడంతోపాటు సర్వీస్ డెలివరీలో నాణ్యత మరియు ఎక్సలెన్స్ ప్రమాణాలను పెంచడం ఈ అవార్డు లక్ష్యం అని పేర్కరొన్నారు. ఈ సంవత్సరం గౌరవ విజేతలలో గోల్డ్ కేటగిరీలో 50 మంది రైడర్లు, సిల్వర్ కేటగిరీలో 60 మంది, కాంస్య కేటగిరీలో 90 మంది ఉన్నారు.

ఉత్తమ డెలివరీ కంపెనీ కేటగిరీలో ఎలైట్ జోన్ డెలివరీ సర్వీసెస్, జోన్ డెలివరీ సర్వీసెస్,  జాజెల్ లాజిస్టిక్స్ సర్వీసెస్ అవార్డులను అందుకున్నాయి. ప్లాట్‌ఫారమ్‌లు మరియు స్మార్ట్ అప్లికేషన్ల కేటగిరీ ద్వారా ఉత్తమ డెలివరీ కంపెనీలుగా DB L.L.C - డెలివరీ హీరో (తలాబత్), CAREEM డెలివరీ సర్వీసెస్,  మోటోబాయ్ డెలివరీ సర్వీసెస్ విజేతలుగా నిలిచాయని రోడ్లు మరియు రవాణా అథారిటీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ల బోర్డు ఛైర్మన్ డైరెక్టర్ జనరల్ మట్టర్ అల్ తాయిర్ తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com