ఫిబ్రవరి 1న దుబాయ్ మెట్రో పని వేళలు పొడిగింపు..!!

- January 31, 2026 , by Maagulf
ఫిబ్రవరి 1న దుబాయ్ మెట్రో పని వేళలు పొడిగింపు..!!

యూఏఈ: దుబాయ్ రోడ్లు మరియు రవాణా అథారిటీ (ఆర్‌టిఏ) ఫిబ్రవరి 1 దుబాయ్ మెట్రో పని వేళలను పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. దుబాయ్ మారథాన్ 2026లో పాల్గొనేవారి సౌకర్యార్థం మెట్రో సేవలు ఉదయం 5 గంటల నుండి అర్ధరాత్రి 12 గంటల వరకు నడుస్తాయని అథారిటీ తెలిపింది. సాధారణ షెడ్యూల్ ప్రకారం, ఆదివారాల్లో దుబాయ్ మెట్రో సేవలు ఉదయం 8 గంటలకు ప్రారంభమై అర్ధరాత్రి వరకు నడుస్తాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com