బహ్రెయిన్ లో హెల్త్ టూరిజం వీసా, కొత్త పర్యవేక్షక కమిటీ..!!
- January 31, 2026
మనామా: షురా కౌన్సిల్ డ్రాఫ్ట్ చట్టం కింద వైద్య సందర్శకుల కోసం ఇన్వాయిస్లు, ముందస్తు కోట్లు మరియు హెల్త్ టూరిజం వీసా ప్రవేశపెట్టనున్నారు. అదే సమయంలో హెల్త్ టూరిజాన్ని సమన్వయం చేయడానికి మరియు ఆసుపత్రులు రోగులు వచ్చే ముందు వారిలో అవగాహన పెంచడానికి ఒక జాతీయ కమిటీని కూడా ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. షురా సభ్యులు డాక్టర్ జమీలా అల్ సల్మాన్, డాక్టర్ జెహాద్ అల్ ఫదేల్, దలాల్ అల్ జాయెద్, డాక్టర్ ఎబ్తేసం అల్ దల్లాల్ మరియు అలీ అల్ అరడి ఈ ప్రతిపాదనలను ప్రతిపాదించారు.
ఆరోగ్య సంరక్షణ ప్యాకేజీల ధరలను ప్రచురించడం మరియు రోగులకు విభాగాల వారీగా చికిత్సలకు అయ్యే ఖర్చులకు బిల్లులను ఇవ్వడం వంటి వ్యవహారాలపై జాతీయ ఆరోగ్య నియంత్రణ అథారిటీ (NHRA)కి కాలానుగుణ నివేదికలను సమర్పించాలని స్పష్టం చేశారు. ఆరోగ్య పర్యాటక సేవలలో వైద్య పరీక్షలు, రోగ నిర్ధారణ మరియు చికిత్స, అలాగే నర్సింగ్, ఆరోగ్య సంరక్షణ, ఆహార కార్యక్రమాలు, వసతి మరియు రిహాబిలిటేషన్ వంటి వివరాలు ఉండాలని నిర్దేశించారు.
తాజా వార్తలు
- నిజమా లేదా నకిలీనా? CPA మార్గదర్శకాలు జారీ..!!
- కువైట్ కార్ల వేల ప్రాజెక్టుకు ఫుల్ డిమాండ్..!!
- ఖతార్ బ్యాంకులు స్ట్రాంగ్ గ్రోత్..!!
- బహ్రెయిన్ లో హెల్త్ టూరిజం వీసా, కొత్త పర్యవేక్షక కమిటీ..!!
- ఫిబ్రవరి 1న దుబాయ్ మెట్రో పని వేళలు పొడిగింపు..!!
- నాన్-సౌదీల నియామకాలపై ఖివా క్లారిటీ..!!
- రేపే డిప్యూటీ సీఎం గా అజిత్ పవర్ భార్య ప్రమాణ స్వీకారం
- ప్రభుత్వ ఉద్యోగులకు షాక్, సోషల్ మీడియా వాడాలంటే అనుమతి!
- ఇక పై గూగుల్ మీ ‘గూగ్లీ’ కి సాయం చేస్తుంది: సీఈఓ
- స్వచ్ఛ్ భారత్ స్ఫూర్తితో సముద్రాల రక్షణకు తెలుగుఈకో వారియర్స్ ఉద్యమం







