ఇజ్రాయెల్‌తో ట్రంప్‌ రాజీ..

- January 31, 2026 , by Maagulf
ఇజ్రాయెల్‌తో ట్రంప్‌ రాజీ..

ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన జెఫ్రీ ఎప్‌స్టీన్‌ కేసులో మరో విస్తుపోయే నిజం వెలుగులోకి వచ్చింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇజ్రాయెల్ చేతిలో కాంప్రమైజ్ అయ్యారని, అగ్రరాజ్య అధ్యక్షుడిపై ఇజ్రాయెల్ తన పట్టును బిగించిందని ఒక విశ్వసనీయ ఎఫ్‌బీఐ మూలం ఆరోపించినట్లు తాజాగా విడుదలైన పత్రాలు పేర్కొంటున్నాయి.ఎఫ్‌బీఐ(FBI) నివేదికలో వెల్లడించిన వివరాల ప్రకారం..డొనాల్డ్ ట్రంప్ ఇజ్రాయెల్ ప్రయోజనాలకు అనుగుణంగా వ్యవహరిస్తున్నారని, దీని వెనుక ట్రంప్ అల్లుడు జారెడ్ కుష్నర్ కీలక పాత్ర పోషిస్తున్నారని ఆరోపణలు వచ్చాయి. ట్రంప్ సంస్థలోనూ, అధ్యక్ష బాధ్యతల్లోనూ కుష్నర్ పరిమితికి మించిన ప్రభావాన్ని చూపిస్తున్నారని ఎఫ్బీఐ ఇన్ఫార్మర్ పేర్కొన్నారు.

జారెడ్ కుష్నర్ కుటుంబానికి రష్యా నుండి అక్రమంగా డబ్బులు వస్తున్నాయని, వారు అతివాద జూయిష్ నెట్‌వర్క్ అయిన చబాద్ తో సంబంధాలు కలిగి ఉన్నారని నివేదిక పేర్కొంది. కుష్నర్ తన రియల్ ఎస్టేట్ ప్లాట్‌ఫారమ్ కాడ్రే ద్వారా రష్యా ప్రభుత్వ సంస్థల నుండి వచ్చిన పెట్టుబడులను సరిగ్గా వెల్లడించలేదని, ఆ నిధులను ఇతర ప్రాజెక్టులకు మళ్లించారని ఆరోపణలు వచ్చాయి. కుష్నర్ తండ్రి గతంలో ఆర్థిక నేరాల్లో జైలు శిక్ష అనుభవించగా, ట్రంప్ తన అధికారంతో ఆయనకు క్షమాభిక్ష పెట్టడంపై కూడా నివేదిక ప్రస్తావించింది. ట్రంప్ గతంలో బెవర్లీ హిల్స్ మాన్షన్‌ను 41 మిలియన్ డాలర్లకు కొని, తర్వాత విదేశీ సంబంధాలున్న ఒక షెల్ కంపెనీకి 95 మిలియన్ డాలర్లకు అమ్మడాన్ని ఎఫ్బీఐ నివేదిక అనుమానాస్పదంగా పేర్కొంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com