టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ బదిలీ...రవిచంద్రకు బాధ్యతలు
- February 01, 2026
తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) కార్యనిర్వహణాధికారి (EO)గా ఉన్న అనిల్ కుమార్ సింఘాల్‌ను ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఫిబ్రవరి 1న అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. అనిల్ కుమార్ సింఘాల్‌ను తక్షణమే సాధారణ పరిపాలన విభాగం (GAD)లో రిపోర్టు చేయాలని ఆదేశించింది.
టీటీడీ ఈవోగా ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శిగా పనిచేస్తున్న ముద్దాడ రవిచంద్రకు పూర్తి అదనపు బాధ్యతలను ప్రభుత్వం అప్పగించింది. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఆయన ఈ బాధ్యతలను నిర్వహించనున్నారు.
1993 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన అనిల్ కుమార్ సింఘాల్ 2017 మే నుంచి 2020 అక్టోబర్ వరకు తొలిసారి టీటీడీ ఈవోగా సేవలందించారు. అనంతరం గతేడాది సెప్టెంబరులో రెండోసారి ఈ పదవిని చేపట్టారు. అయితే కేవలం ఐదు నెలల వ్యవధిలోనే ఆయన బదిలీ కావడం టీటీడీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
ఇదిలా ఉండగా, తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడిన వ్యవహారంపై సిట్ నివేదిక వెలువడిన కొన్ని రోజుల్లోనే ఈ బదిలీ జరగడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ పరిణామం రాజకీయ, పరిపాలనా వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది
తాజా వార్తలు
- అదృష్టం కాదు.. ప్రణాళికే గల్ఫ్ దేశాల ఆర్థిక బలానికి కారణం..!!
- ఒమన్‌లో 2.56 లక్షలకు వృద్ధుల సంఖ్య..!!
- Four astronauts reach International Space Station in record time
- సౌదీలో హౌతీ బాలిస్టిక్ మిసైల్ కూల్చివేత..!!
- అక్టోబర్ నెలంతా దేశవ్యాప్త నిరసనలు.. CJP కీలక పిలుపు
- పైలట్ స్మిత్ మచ్చర్ కోలుకుంటున్నారు..భారత రాయబారి..!!
- మదీనాలో హౌతీ దాడి.. తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- షార్జా జ్యువెలరీ షోలో ప్రపంచంలోనే ఎత్తైన బంగారు బార్..
- కువైట్‌లో వర్షాలు.. తగ్గనున్న ఉష్ణోగ్రతలు..!!
- వన్డే ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల..







