ఇందిరమ్మ ఇళ్లకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- February 02, 2026
హైదరాబాద్: తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇండ్ల పథకానికి కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించనుంది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన (PMAY) కింద రాష్ట్రంలో నిర్మించనున్న ఇళ్లకు కేంద్రం తన వాటాను విడుదల చేయనుండటంతో లక్షలాది పేద కుటుంబాలకు ఊరట లభించనుంది.
పట్టణ ప్రాంతాల్లో ఒక్కో ఇంటికి రూ.1.50 లక్షలు, గ్రామీణ ప్రాంతాల్లో రూ.72 వేల చొప్పున కేంద్రం మంజూరు చేయనుంది. 2026-27 ఆర్థిక సంవత్సరానికి సుమారు 4.13 లక్షల ఇళ్లకు కేంద్ర నిధులు అందే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. పీఎంఏవై-అర్బన్ 2.0 కింద 1.13 లక్షల ఇళ్లు కేటాయించగా, ఇప్పటికే 10 వేల ఇళ్లకు ఆమోదం లభించింది. మిగిలిన ఇళ్ల కోసం వేల కోట్ల రూపాయలు విడుదల కానున్నాయి.
గ్రామీణ ప్రాంతాల్లో కూడా భారీగా ఇళ్లు మంజూరయ్యే అవకాశముంది. పీఎంఏవై-గ్రామీణ్ కింద దాదాపు 3 లక్షల ఇళ్లకు నిధులు రానున్నాయి. అదనంగా, ఆదివాసీల కోసం ప్రత్యేకంగా 10 వేల ఇళ్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి, ఒక్కో ఇంటికి రూ.1.20 లక్షలు కేటాయించడం విశేషం. ఈ చర్యలతో రాష్ట్రవ్యాప్తంగా ఇళ్ల నిర్మాణం వేగవంతం కానుందని ప్రభుత్వం భావిస్తోంది.
తాజా వార్తలు
- అదృష్టం కాదు.. ప్రణాళికే గల్ఫ్ దేశాల ఆర్థిక బలానికి కారణం..!!
- ఒమన్‌లో 2.56 లక్షలకు వృద్ధుల సంఖ్య..!!
- Four astronauts reach International Space Station in record time
- సౌదీలో హౌతీ బాలిస్టిక్ మిసైల్ కూల్చివేత..!!
- అక్టోబర్ నెలంతా దేశవ్యాప్త నిరసనలు.. CJP కీలక పిలుపు
- పైలట్ స్మిత్ మచ్చర్ కోలుకుంటున్నారు..భారత రాయబారి..!!
- మదీనాలో హౌతీ దాడి.. తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- షార్జా జ్యువెలరీ షోలో ప్రపంచంలోనే ఎత్తైన బంగారు బార్..
- కువైట్‌లో వర్షాలు.. తగ్గనున్న ఉష్ణోగ్రతలు..!!
- వన్డే ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల..







