ఎక్స్ఛేంజ్ కంపెనీలలో క్యాష్ లిమిట్ తగ్గింపు..!!
- February 03, 2026
కువైట్: సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ కువైట్ (సీబీకే) ఎక్స్ఛేంజ్ కంపెనీలు కస్టమర్ల నుండి స్వీకరించగల రోజువారీ క్యాష్ లిమిట్ ను రోజుకు కేడీ 1,000కి తగ్గించింది. ఈ మేరకు కొత్త నిబంధనలు ఫిబ్రవరి 2 నుండి అమలులోకి వచ్చాయని ఒక ప్రకటలో తెలిపింది. అయితే, గతంలో కస్టమర్లు కేడీ 3,000 వరకు నగదు రూపంలో చెల్లించడానికి అనుమతి ఉండేది. కానీ కొత్త నిబంధన ప్రకారం, ఎక్స్ఛేంజ్ కంపెనీలలో కేడీ 1,000 కంటే ఎక్కువ నగదు చెల్లింపులను ఇకపై అనుమతించరు.
అయితే, లావాదేవీల మొత్తం విలువపై ఎటువంటి పరిమితి లేదని, ఈ పరిమితి చెల్లింపులోని నగదుకు మాత్రమే వర్తిస్తుందని సెంట్రల్ బ్యాంక్ స్పష్టం చేసింది. విదేశీ డబ్బు బదిలీలకు అలాగే విదేశీ కరెన్సీల కొనుగోలు మరియు అమ్మకాలకు కూడా వర్తిస్తుందని తెలియజేసింది. మనీలాండరింగ్ మరియు ఉగ్రవాదానికి నిధుల సరఫరాకు వ్యతిరేకంగా నియంత్రణలను బలోపేతం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు కువైట్ సెంట్రల్ బ్యాంక్ తెలిపింది.
తాజా వార్తలు
- ఇరాన్ పై ట్రంప్ తీవ్ర హెచ్చరిక.. ఒప్పందం కుదరకపోతే ‘అంతం చేస్తా’
- రక్షణ, ఏరోస్పేస్ పరిశోధనలకు ఊతం.. బిట్స్ పిలానీ, DIAT మధ్య 20 అవగాహన ఒప్పందాలు
- ‘వందేమాతరం’ వివాదం..డీకే శివకుమార్ ప్రభుత్వానికి గవర్నర్ హెచ్చరిక
- కల్బాలో అల్ ఫ్రైష్ సరస్సు ప్రాజెక్టుకు షార్జా రూలర్ ఆమోదం
- హైదరాబాద్‌లో భారీ వర్షం..కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్
- 72వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో తెలుగు సినిమాకు ఘన గౌరవం
- మారిషస్ రాష్ట్రపతి చేతుల మీదుగా డా.గజల్ శ్రీనివాస్ ‘శ్రీమద్భగవద్గీత’ ఆల్బమ్ ఆవిష్కరణ
- ఎట్టకేలకు ఏపీలో నంది అవార్డులు..
- షేక్ అహ్మద్‌కు అంతిమ ప్రార్థనలు.. హాజరైన షేక్ మహమ్మద్, పలువురు రాజకుటుంబ సభ్యులు
- రాస్ అల్ ఖైమా రూలర్ ని కలిసిన భారత కాన్సుల్ జనరల్ డాక్టర్ విష్ణువర్ధన్ రెడ్డి







