క్రికెట్‌లో కొత్త రూల్స్, చౌక బ్యాట్లకు గ్రీన్ సిగ్నల్!
- February 04, 2026
క్రికెట్ అభిమానులకు గుడ్‌న్యూస్. ఆటను మరింత సరదాగా, అందరికీ అందుబాటులో ఉండేలా మార్చేందుకు Marylebone Cricket Club (MCC) కొత్త క్రికెట్ చట్టాలను ప్రకటించింది. మొత్తం 73 సవరణలతో రూపొందించిన ఈ కొత్త నియమావళి 2026 అక్టోబర్ 1 నుంచి ప్రపంచవ్యాప్తంగా అమల్లోకి రానుంది.
ఈ మార్పుల్లో అత్యంత కీలకమైనది అమెచ్యూర్ క్రికెట్‌లో చౌక రకం లామినేటెడ్ బ్యాట్లకు అనుమతి ఇవ్వడం. ఇంగ్లిష్ విల్లో బ్యాట్ల ధరలు భారీగా పెరగడంతో సాధారణ ఆటగాళ్లకు భారంగా మారింది. దీనిని దృష్టిలో ఉంచుకుని ‘టైప్-డి’ లేదా (New cricket rules 2026) లామినేటెడ్ బ్యాట్లను ఓపెన్ ఏజ్ క్రికెట్‌లోనూ వాడుకోవచ్చని ఎంసీసీ స్పష్టం చేసింది. దీంతో తక్కువ ధరలో బ్యాట్లు అందుబాటులోకి రానున్నాయి.
అదే సమయంలో ఆటను మరింత ఉత్కంఠభరితంగా మార్చేందుకు పలు కీలక నిబంధనలు తీసుకొచ్చారు. టెస్టు మ్యాచ్‌ల్లో చివరి ఓవర్ పూర్తయ్యే వరకు ఆట కొనసాగించాలి. బౌండరీ వద్ద ‘బన్నీ హాప్’ క్యాచ్‌లపై కఠిన నిబంధనలు విధించారు. వికెట్ కీపర్ గ్లోవ్స్ స్థానం, డిక్లరేషన్ హక్కులు, ఓవర్‌త్రోలు వంటి అంశాల్లో స్పష్టత తీసుకొచ్చారు.
మహిళల, జూనియర్ క్రికెట్ కోసం బంతుల పరిమాణం, బరువుకు ప్రమాణాలు నిర్ణయించారు. అంతేకాకుండా నియమావళిలో లింగ సమానత్వ పదజాలాన్ని చేర్చడం, భాషను సులభతరం చేయడం వంటి మార్పులు చేశారు. ఈ సవరణలతో క్రికెట్ మరింత అందుబాటులోకి వస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
తాజా వార్తలు
- ఖతార్లో ప్రయాణికుల మెడిసిన్స్ కు ఈ-పర్మిట్..!!
- ఆన్లైన్ ట్రావెల్ మోసాలపై ప్రయాణికులకు హెచ్చరిక..!!
- షేక్ ఈసా బ్రిడ్జిపై తాత్కాలికంగా ఒక లేన్ మూసివేత..!!
- బహ్రెయిన్ లో స్మాల్ బోట్స్ కు రిమోట్ టెక్నికల్ తనిఖీలు..!!
- కువైట్లో అక్రమ గర్భస్రావాల కేసు.. డాక్టర్ అరెస్ట్..!!
- జీసీసీ-యూరప్ పార్లమెంటరీ సమావేశం.. ప్రాంతీయ భద్రతపై ఆందోళన..!!
- సౌదీలో ఎండల తీవ్రత.. కొన్ని ప్రాంతాల్లో వర్షాలు..!!
- యూఏఈలో కొత్త విద్యాసంవత్సరానికి భారీగా పెరిగిన ఖర్చులు..!!
- మూడు వారాల విరామం తర్వాత బహ్రెయిన్, కువైట్కు ఎతిహాద్ విమాన సర్వీసులు పునఃప్రారంభం
- వాహనదారులకు రవాణా శాఖ గుడ్‌న్యూస్







